Suryaa.co.in

Andhra Pradesh

అధికారులపై అధికారపార్టీ నేతలు దాడులు

– మీ అంతు చూస్తామంటూ బెదిరింపులు
– పెందుర్తి ఆర్ ఐ, వి ఆర్ ఓ ల పై దాడి
– వైసీపీ నేతలపై పోలీసు కమిషనర్‌కు కలెక్టర్ ఫిర్యాదు

విశాఖ : విశాఖ లో మరోసారి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తమ విధులను నిర్వహించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారుల పై పట్టపగలే దాడి చేశారు.

వివరాల్లోకి వెళితే పెందుర్తి మండలం సత్తి వాని పాలెం 355 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన గోడను రెవెన్యూ సిబ్బంది తొలగించడానికి వెళ్లగా అది తెలుసుకున్న స్థానిక వైసిపి నేత దొడ్డి కిరణ్ పెందుర్తి రెవెన్యూ ఆర్ ఐ శివ సచివాలయం విఆర్వో శంకర్ లపై మరియు రెవెన్యూ సిబ్బంది పై నానా దుర్భాషలాడుతూ తన అనుచరులతో దాడికి దిగి కొట్టడంతో పాటు జెసిపి లాక్కున్నారు మీ అంతు చూస్తానంటూ రెవెన్యూ సిబ్బందిని బెదిరించి ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత కిరణ్ .

దీంతో చేసేదేమీ లేక భయభ్రాంతులకు గురి అయిన రెవెన్యూ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ వెనుదిరిగారు.. ప్రభుత్వ భూములను కాపాడడానికి వెళ్తే తమపై దాడి చేశారని ఆర్ ఐ శివ కంటతడి పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వైసిపి నేత దొడ్డి కిరణ్ పై తమ ఉన్నత అధికారులు అయిన ఆర్ డి ఓ మండల రెవెన్యూ అధికారి కి జరిగిన విషయం తెలిపామని అన్నారు.

ఈ విషయంపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నతాధికారుల ఆదేశాలతో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు అయితే ఆర్ ఐ శివ విఆర్ఓ శంకర్ పై దాడికి నిరసనగా రెవిన్యూ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు.

పోలీసు కమిషనర్‌కు కలెక్టర్ ఫిర్యాదు
కాగా ఈ ఘటనపై స్పందించిన విశాఖ కలెక్టర్.. వెంటనే పోలీసు కమిషనర్‌కు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని గత రెండేళ్ల నుంచి విశాఖ జిల్లా రెవిన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా, గత కలెక్టర్ పట్టించుకోలేదని కొత్త కలెక్టర్ ఈ విషయంలో వెంటనే స్పందించి తమ పక్షాన నిలిచినందుకు ఉద్యోగులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
pendurthi

LEAVE A RESPONSE