తెల్ల బంగారంగా మారిన పత్తి

Spread the love

– రికార్డు స్థాయిలో ధరలు
– స్పిన్నింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్ధకం
( వీఆర్)

తెల్ల బంగారం నిజంగానే బంగారం అయింది. రైతు కళ్లల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రకృతి అనుకూలిస్తే రైతు పంట పండేదే. ఇది ఈ ఏడాది ఆంధ్రరాష్ట్రంలో పత్తి బంగారమైన ఆనంద హేల బంగారం అంటున్నామంటే ఆ స్థాయిలో గిట్టుబాటు ధర ఉందని అర్థం.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్తి క్వింటా ధర 10 వేల నుండి 13 వేల వరకు పత్తిని రైతుల నుండి వ్యాపారులు గిరాకిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే అధిక వర్షాలు, తెగుళ్లతో ఏపీలో ఏటా 15 లక్షల ఎకరాలు ఉండే సాగు పది లక్షలకు గణనీయంగా పడిపోయింది. అయితే ఉన్న పంటకు రికార్డు స్థాయిలో ధర లభించడం పత్తి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధర 6000 కు మాత్రమే కొనుగోలు చేస్తుండగా సాగు తక్కువగా ఉండడం, దూదికి డిమాండ్ పెరగడంతో బయట మార్కెట్లో వ్యాపారులు, క్వింటాకు పదివేల వరకు కొనుగోలు చేస్తున్నారు.

ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలలో నాణ్యమైన పత్తి రకాన్ని 13 వేల వరకూ కొంటున్నారు. ఈ ముడి పత్తి ద్వారా వచ్చే దూది ఒక క్యాండీ ధర 80 వేల వరకు పలుకుతోంది. కరోనా అయినప్పటికీ చైనా, వియత్నం తదితర 35 దేశాలలో మన నూలుకు డిమాండ్ ఉండడంతో ఎగుమతి జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణ, రాయలసీమ అనేక జిల్లాలలో పత్తి సాగు చేస్తారు. ఈ పత్తి అంతా గుంటూరు ప్రాంతంలోని ఉన్న 70 స్పిన్నింగ్.మిల్లు లకు సరఫరా అవుతుంది. ఇలా ఈ ఏడాది పత్తి రైతులకు మంచిరోజులు వచ్చాయి.

గుంటూరు జిల్లా పల్నాడు కు చెందిన మాడుగుల గ్రామం M.వెంకటేశ్వర్లు అనే రైతు మాట్లాడుతూ కుండపోత వర్షాలతో వేసిన పత్తి పంట అంతా ఊరక బారి పోయిందని అభిప్రాయపడ్డారు. కొంత పంట మిగిలితే గులాబీ పురుగు తెగులుతో పాడైందని చెప్పారు. పత్తి ధర మాత్రం మేము ఎప్పుడూ ఇంత చూడలేదని ధర గిరాకి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఈ ఏడాది పత్తి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు దీనిపై సి సిసిఐ మేనేజర్ గోగినేని సాయి ఆదిత్య మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన క్వింట పత్తి ధర గురువారం నాడు 6,025 రూపాయలు గా ఉందని తెలిపారు. కాగా బయట మార్కెట్లో మిల్లర్లు అధిక ధరకు కొనుగోలుకు
cotton1 ముందుకు రావడంతో సీసీఐ ద్వారా అమ్మేందుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు.
ఎన్నడూ లేని విధంగా పత్తి కింటా ధర 10వేల వరకు పలుకుతుండడంతో రైతులకు లాభం అయినా, స్పిన్నింగ్ మిల్లులు నడపడం కష్టంగా మారిందని స్పిన్నింగ్ మిల్లు యజమాని పచ్చల శంకర్రావు ది పయనీర్ తో మాట్లాడుతూ చెప్పారు. కరోనా కాలంలో విదేశాలకు ఎగుమతులకు ఇబ్బందిగా ఉందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, కూలీల రేట్లు, రెట్టింపైన పత్తి ధరతో సమానంగా నూలు ధర పలకడం లేదని స్పిన్నింగ్ మిల్లులు నడవడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన పవర్ సబ్సిడీ 10 వేల కోట్లు ఉందని ఈ కష్ట సమయంలో స్పిన్నింగ్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకునేందుకు సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Leave a Reply