– విశ్వహిందూ పరిషత్ దర్మప్రసార్ సహ ప్రముఖ్ మదురనేని సుభాష్ చందర్
షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్న అయ రాష్ట్రాలలో హిందూ వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ దర్మ ప్రసార్ సహ ప్రముఖ్ మదురనేని సుభాష్ చందర్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి, కేవలం హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తు గుళ్ళను, విగ్రహం మూర్తులను ద్వసం చేస్తున్నారని అన్నారు. ఈరోజు షాద్‌నగర్ లోని ఫారుఖ్ నగర్ అమరేశ్వర అలయంలో శివలింగాన్ని ద్వంసం చేశారు.
హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం అంబాటిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.
ఇలా తెలంగాణలో ఎన్నో అలయాలు ద్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎ ఒక్క నిందితులను అరెస్టు చేసిన పాపాన పోలేదని అన్నారు. కేవలం ముస్లిం ఓట్ల కోసం హిందూ మనోభావాలను పటించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యమంలో విశ్వహిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ దివాకర్, బజరంగ్ దళ్ సంగారెడ్డి జిల్లా సంయోజక్ ప్రభుకుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.