-పోలింగ్ బూత్ సమీపంలో వైసీపీ గూండాల అరాచకం
-ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై వైసీపీ గూండాలు కత్తులతో దాడికి యత్నించారు. రెండురోజుల క్రితం టీడీపీ కార్యకర్త సుబ్బును కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇదే గ్రామంలో మరో ఇద్దరిని కొట్టి గాయపరిచారు. అయితే వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కత్తులు చూపించి దౌర్జన్యం చేస్తూ దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయారు.
ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి పోలీసులు, వైసీపీ శ్రేణుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ ఈ గ్రామానికి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి రెచ్చగొట్టా రని, వారు ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాతనే టీడీపీ, జనసేన కార్యకర్తలపై దాడులకు దిగినట్లు తెలిపారు. ఒక మహిళా డాక్టర్ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ తనపై కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, తాను గెలవబోతున్నానన్న అక్కసుతో ఓటమి భయం తో వైసీపీ గూండాలు ఇటువంటి చర్యలకు పాల్పడటం తగదన్నారు. టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఓటేయాలని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.