ఔరంగజేబ్ టెర్రరిస్ట్ !

Spread the love

– దురాక్రమణ దారుడిని టెర్రరిస్ట్ అనే అంటాం బాజాప్తా

అవును టెర్రరిస్ట్ ని టెర్రరిస్ట్ అనకుండా దేశభక్తుడు అనడానికి అక్కడ ఉంది నకిలీ గాంధీ కాదు. కాశీ
modi-kasi-picవిశ్వనాథ్ ప్రాంగణం ప్రారంభోత్సవానికి వెళ్ళిన మోదీజీ, దుష్ట కలలు కన్న ఔరంగజేబ్ ని ఓడించడానికి ఈ దేశం శివాజీ మహరాజ్ ని ఇచ్చింది.ఇదీ ప్రధాని మోదీజీ అన్నమాట.దీనిని వామపక్షులు, హిందూ వ్యతిరేక శక్తులు వక్రీకరించి మోదీజీ ఔరంగజేబ్ ని టెర్రరిస్ట్ అన్నాడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.మోదీజీ అలా అనలేదు కానీ మేము ఔరంగజేబ్ ని టెర్రరిస్ట్ అనే అంటాము.

ఔరంగజేబ్ వేలమంది సాధువులని చంపాడు. బలవంత మత మార్పిడులు చేసాడు. మతం మారడానికి ఒప్పుకొని వాళ్ళని క్రూరంగా హింసించి చంపాడు. కాశీ విశ్వనాధుని మందిరం ని మసీద్ గా మార్చాడు. ఇప్పటికీ నంది ఎదురుచూస్తున్న ప్రదేశం మసీదులో ఉంది. ఆ మసీదు పేరు గ్యానవాపి మసీద్ ! వాహ్ ! గ్యాన అంటే జ్ఞానం లేదా బుద్ధి, వాపి అంటే కొలను లేదా కోనేరు అని అర్ధం. అంటే జ్ఞానాన్ని ప్రసాదించే కోనేరు ఉన్న ప్రదేశం అని అర్ధం వచ్చే పేరు మసీదుకు ఎలా పెట్టారు ? అది హరాం కాదా ? కాశీ విశ్వనాధుని మందిరం కూల్చి మసీదు కట్టమని జారీ చేసిన ఫత్వా ఇంకా అందుబాటులోనే ఉంది .
ourangajebఇక మధుర శ్రీ కృష్ణ ఆలయాన్ని కూడా కూల్చి, మసీదు కట్టమని జారీ చేసిన ఫత్వా కూడా అందుబాటులో ఉంది.ఫోటో చూడండి. అందులో తన దుష్ట మూకలకి ఆదేశాలిస్తూ మధుర కృష్ణ మందిరం కూల్చి వేసి శ్రీ కృష్ణుని విగ్రహంని మసీదు మెట్ల కింద పెట్టి పైన మెట్లు కట్టమని ఉంది. మరి ఇలాంటి వాడిని టెర్రరిస్ట్ అనకుండా ఏమనాలి మీరే చెప్పండి ?

అసలు స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకి కూడా, ఎన్ని గుళ్ళు కూలగొట్టి మసీదులు కట్టారో లెక్క తేల్చని గత ప్రభుత్వాలని ఏమనాలి ? ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన దురాక్రమణ దారుడిని టెర్రరిస్ట్ అనే అంటాం ! బాజాప్తా.
జైహింద్ !

– పెంజెర్ల మహేందర్‌రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

Leave a Reply