Suryaa.co.in

Devotional National

ఆ శాఖాహార మొసలి ఇక లేదు!

అదేంటి? మొసలి ఏంటి? శాఖాహారి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం కోనేరులో ఉన్న మొసలిపేరు పబియా. భక్తులు కోనేరులో స్నానాలు చేస్తున్నప్పుడు వారి వద్దకు వచ్చే పబియా, భక్తుల జోలికి వెళ్లేది కాదు. పూజ సమయాల్లో చెరువులోంచి గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరిగిimage-2 చెరువులోకి వెళ్లేవాడు! కేవలం గుడి ప్రసాదం మీదే జీవిస్తుంటాడు, చెరువులోని చేపలను తినడు కాబట్టి , అతనికి “శాఖాహార మొసలి” అని మరో పేరు కూడా ఉంది. అందుకే కొలనులో మొసలి ఉందని తెలిసినా భక్తులు నిర్భయంగా స్నానాలు చేసేవారు. ఇంకో విచిత్రమేమిటంటే అది కేవలం దేవుడి ప్రసాదం

మాత్రమే తినేది. అదే దాని ఆహారం. ఎంతో భక్తితో నైవేద్య సమయానికి దేవాలయంలోకి చేరి, ఎవరిని భక్తులని ఇబ్బంది పెట్టకుండా స్వామివారి దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించి, మరలా కోనేరులోకి పయనించేవాడు.

కానీ ప్రతి జీవికి భగవంతుని పాదాల చెంతకు చేరే సమయం ఉంటుంది కాబట్టి, నిన్న తెల్లవారుజామున పబియా ఆరోగ్యం విషమించి భగవంతుడి పాదాలకు చేరింది. ఈ విషయం స్థానికంగా ఎంతో మంది భక్తులను కలవర పెట్టింది. దాని అంత్యక్రియలను దేవస్థానం అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.image-1

LEAVE A RESPONSE