రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏం సాధించాడు?

-23 మంది ఎంపీలతో, కేంద్రంతోదోస్తీచేస్తున్న జగన్ రెడ్డి, రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఏంసాధించాడు?
– ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల్లో ఆగ్రహావేశాలు రెచ్చగొట్టి పబ్బంగడుపుకోవడానికే ప్రభుత్వం పనిగట్టుకొని రైతుల పాదయాత్రపై దండయాత్ర చేస్తోంది
• జగన్ రెడ్డి, మంత్రుల వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రప్రజలు సంయమనం కోల్పోవద్దు
• పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఉద్యమాలు, గర్జనలు నిర్వహించి రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారు
• 6 గిరిజన నియోజకవర్గాలకు కేంద్రనుంచి రావాల్సిన నిధుల్ని కూడా రాబట్టలేకపోయాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు

జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం పనిగట్టుకొని మరీ ఉత్తరాంధ్రవాసుల్ని, అమరావతి రైతులపైకి ఉసిగొల్పుతోందని, హైకోర్టు అనుమతితో సాగుతున్న యాత్రను అడ్డుకోవడం కోర్టు ధిక్కారం అవుతుందని తెలిసికూడా మంత్రులుధర్మాన, బొత్స, అమర్నాథ్, మరికొందరు పదవుల కోసం దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీసీనియర్ నేత, పొలిట్ బ్యూరోసభ్యులు కళా వెంకట్రావు తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“రైతుల పాదయాత్రపై వైసీపీ దండయాత్రచేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి దర్శకత్వంలో ప్రాంతీయ విద్వేషాలురేపి, కులమతచిచ్చు పెట్టడానికే మంత్రులు రైతులపాదయాత్రపై మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రలోని 6 గిరిజన నియోజకవర్గాలకు జగన్ రెడ్డి తనహాయాం లో ఏంచేశాడో చెప్పాలి? ఆఖరికి కేంద్రంనుంచి ఆప్రాంతానికి రావాల్సిన నిధుల్ని కూడా రాబట్టలేక చేతులెత్తేశాడు. టీడీపీహాయాంలో కేంద్రప్రభుత్వంనుంచి ఉత్తరాంధ్రకు ఎన్ని నిధులువచ్చాయో, ఇప్పుడెన్ని వచ్చాయో చెప్పగలరా? ఐటీడీఏలకు ఇచ్చిన నిధులెన్ని, గిరిజన విశ్వవిద్యాలయంకోసం ఏం ఒరగబెట్టారో చెప్పాలి. పెయిడ్ ఆర్టిస్ట్ లతో గర్జనలు, ఉద్యమాలు చేసి, రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలని చూస్తున్నారు. 23మంది ఎంపీలతో కేంద్రంతో దోస్తీచేస్తూ, జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు ఏంసాధించాడు? విశాఖపట్నంలోని ప్రభుత్వభూములు, ఆస్తుల్ని అప్పులకోసం తనఖాపెట్టారు.

అప్పులకోసం దేశంలో ఏప్రభుత్వం దిగజారనంతగా జగన్ ప్రభుత్వం అధమస్థితికి దిగజారింది. ఉత్తరాంధ్ర సాగునీటిప్రాజెక్టులకు మూడేళ్లలో ఎన్నినిధులు ఖర్చుపెట్టారు? మూడుజిల్లాల్లోని అధికారుల జీతభత్యాలకు కూడాసరిపోని నిధులు మూడేళ్లలో జగన్ రెడ్డి విదిల్చాడు. భావనపాడు పోర్టు ఏమైందో ప్రజలకు చెప్పండి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సంగతేంటి? ఎలాంటి లాలూచీలతో కేంద్రంనుంచి ఏం సాధించలేకపోతున్నారో చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏంచేశారు.. ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? కేంద్రం ఇస్తుందన్న రైల్వేజోన్ సాధనకు మూడున్నరేళ్లలో ఏంచేశారు? హైకోర్ట్ అనుమతితో జరుగుతున్న పాదయాత్రపై మంత్రుల్ని ఉసిగొల్పడం కోర్టు ధిక్కారం కాదా?

శాఖలు మారుస్తాను…పీకేస్తానని ముఖ్యమంత్రి బెదిరించాకనే మంత్రులు రైతుల పాదయాత్రపై పడ్డారు. మంత్రుల వ్యాఖ్యలపై ఉత్తరాంధ్ర ప్రజలంతా సంయమనంతో ఆలోచించాలి. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఉత్తుత్తిపథకాలతో ఊదరగొడుతున్నారని ప్రజలకు అర్థమైంది. వారిని దారిమళ్లించడానికే జగన్ రెడ్డి, అండ్ కో పాదయాత్రపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలియకూడదనే మంత్రులు అమరావతియాత్రపై పడ్డారు.

మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మానప్రసాదరావు, అమర్నాథ్ తోపాటు రోజుకోమంత్రి దండయాత్రకు వస్తున్నారు. మూడురాజధానుల పేరుచెప్పి మూడేళ్లయినా, ఎక్కడైనా జగన్ అండ్ కో ఏమైనా అభివృద్ధిచేశారా? న్యాయంగా సాగుతున్న రైతులపాదయాత్రపై విరుచుకు పడుతున్న మంత్రులు, జగన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రకు ఏం ఒరిగిందో చెప్పాలి. ఉత్తరాంధ్రలో లక్షఎకరాలు కొన్నారన్న సమాచారంపై ప్రభుత్వపెద్దలు ఎందుకు స్పందిం చరు? వైసీపీఎమ్మెల్యేలు,మంత్రులు, ఎంపీలు వారి బినామీలు, అనుచరుల కింద ఎన్నిభూములున్నాయో తేల్చేధైర్యం ప్రభుత్వానికి ఉందా?” అని కళావెంకట్రావు నిల దీశారు.