-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్
-116వ జయంతి సందర్భంగా నివాళి
ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వివక్ష, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గళాన్ని బలంగా వినిపించిన నాయకుడు బాబూ జజ్జీవన్‌రామ్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జజ్జీవన్‌రామ్ 116వ జయం తి సందర్భంగా గుంటూరులోని పట్టాభిపురం, మార్కెట్ ఏరియాలోని విగ్రహాలకు బూర్ల రామాం జనేయులు, ఇతర నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాటి రోజుల్లో అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో జగజ్జీవన్‌రామ్ ఒకరని, ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నాయకులు ఎదగాలని తెలిపారు. అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తూర్పు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ జగజ్జీవన్‌రామ్ చేసిన అభివృద్ధి, సంక్షేమం మరువలేనిది అన్నారు. మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ మాట్లాడుతూ జగజ్జీవన్‌రావు చేసిన పోరాటాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఒకసారి గుర్తు పెట్టుకోవాలన్నారు. చరిత్రలో దళితుల హక్కులను అవమానించిన నాయకులు ఎవరూ లేరని, తొలిసారి జగన్ ఆ ఘాతుకానికి పాల్పడ్డా రని తెలిపారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం జగ్జీవన్‌రామ్ చేసిన కృషి అనీర్వచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సునీత తదితరులు పాల్గొన్నారు.