Suryaa.co.in

Andhra Pradesh

వైద్యుల నిర్లక్ష్యంతో ఆగిన పసి గుండె

– మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ఎమ్మారై స్కానింగ్ మిషన్ లో ఆగిన 14 నెలల పాప గుండె

మంగళగిరి: కాకినాడకు చెందిన కొంతం గంగరాజు, కుమారి దంపతులకు 14 నెలల పాప తన్వి శ్రీ గత నెల రోజుల క్రితం ఆగి ఉన్న ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడిపోగా మెడ లోపలి భాగంలో స్వల్ప గాయమైంది.దీంతో తల్లిదండ్రులు గత మూడు రోజుల క్రితం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు.

అప్పటివరకు ఆడుకుంటూనే ఉన్న తన్వి శ్రీ ని బుధవారం ఉదయం ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎమ్మారై స్కానింగ్ తీసుకువెళ్లారు. వైద్యులు పాపకు మత్తు ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. అర్థగంట తరువాత పాప స్కానింగ్ మిషీన్ లోనే చనిపోయిందని, క్యాన్సర్ అని వైద్యులు తెలిపారని తల్లి కుమారి ఆవేదన వ్యక్తం చేసింది.

అప్పటివరకు జూనియర్ వైద్యులు వైద్యం అందించగా పాప మృతితో సీనియర్ వైద్యులు వచ్చి పరిశీలించారని తెలిపారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, అప్పటివరకు ఆడుకుంటున్న తన్వి శ్రీ హఠాత్తుగా మృతి చెందడం తీవ్ర మనోవేదన కలిగించిందని తల్లి కుమారి కన్నీటిపర్యంతమయ్యింది.

నిర్ధారణ లేకుండా తన్వి శ్రీ కి క్యాన్సర్ అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తన్వి శ్రీ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తీవ్ర మనోవేధనతో తన్వి శ్రీ తల్లిదండ్రులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా పోలీసులు విచారణ చేపట్టారు.

LEAVE A RESPONSE