Suryaa.co.in

Andhra Pradesh

జనసేన కార్యకర్తలకు అండగా ఉంటుంది

– ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు

ఏలూరు: ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల భీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏలూరు లో జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని 18 చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణాజిల్లా స్థానిక జనసేన శాసనసభ్యులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ఒంటిపులి సాంబశివరావు మృతి చెందారు. వారి తల్లి లలిత కి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచన చాలా గొప్పదని ఈ విధంగా కష్టంలో ఉన్న కార్యకర్తలకు అండగా ప్రమాద భీమాని కల్పించడం చాలా గొప్ప విషయమని రాజకీయాల్లో ప్రమాదవశాత్తూ కార్యకర్తలు మరణించినా వారి కుటుంబానికి అండగా ఈ బీమా సొమ్ము ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట జనసేన నాయకులు బడిశా మురళి కృష్ణ, ఈమని కిషోర్ కుమార్, షౌకత్ అలీ, మేడూరి వెంకటాద్రి(బాబ్లు) పాల్గొన్నారు.

LEAVE A RESPONSE