Suryaa.co.in

National

అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్

– నేటి నుంచి నో స్పాట్ బుక్కింగ్
– ఆ రోజుల్లో మాత్రమే భక్తులకు చాన్స్

శబరిమలలో మకరజ్యోతి ఉత్సవాలకు మరో ఐదు రోజుల సమయం ఉంది. దీంతో శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) రద్దీని అరికట్టడానికి, సవ్వంగా అన్ని పనులు నిర్వహించడానికి బుధవారం నుండి స్పాట్ బుకింగ్‌ను నిలిపివేసింది.

జనవరి 15వ తేదీన మకరవిళక్కు ఉత్సవ్ (మకర జ్యోతి దర్శనం) జరగనుంది. శబరిమలలో గత కొన్ని రోజులుగా రోజుకు సగటున 90, 000 మంది అయ్యప్ప భక్తులు చేరుకుంటున్నారు. శబరిమలలో అయ్యప్ప దర్శనం కోసం 10 గంటల నుంచి సుమారు18 గంటల పాటు అయ్యప్ప భక్తులు వేచి ఉండాల్సి వస్తోందని ఇదే విషయంలో అయ్యప్ప భక్తులు వాపోతున్నారు.

చిన్నారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు ఇక శబరిమలకు వెలుతున్న వృద్ధులను పరామర్శించే పరిస్థితి నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం, గర్భగుడి సమీపంలోని ఫ్లైఓవర్‌పై క్యూలో ఉపయోగించిన బారికేడ్ కిందపడిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ అయ్యప్ప భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు శబరిమల ఆయలం నిర్వహణ కమిటి అధికారులు తెలిపారు.

మకరవిళక్కు (మకరజ్యోతి) కు నాందిగా గురువారం ఎరుమేలిలో చందనకూడం ఉత్సవం జరగనుంది. మత సామరస్యాన్ని పెంపొందించే పండుగ ఇది. ఎరుమేలి పట్టణంలో చందనకూడం ఊరేగింపు జరగనుంది. మకర పూజ బుకింగ్ ప్రారంభం శబరిమల ఆలయంలో మకర పూజ కోసం జనవరి 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు వర్చువల్ బుకింగ్‌ను టీడీబీ (TDB) ప్రారంభించింది.

జనవరి 16వ తేదీన రోజుకు 50,000 మంది భక్తులు, జనవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజుకు 60, 000 మంది భక్తులకు అయ్యప్పను దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని టీడీబీ తెలిపింది. ఈ రోజుల్లో పంబా, నిలక్కల్, వండిపెరియార్ అనే మూడు ప్రదేశాలలో మాత్రమే జనవరి 16వ తేదీ నుండి స్పాట్ బుకింగ్ అనుమతించబడుతుంది. శబరిమలలో కొత్త పోలీసు బ్యాచ్ బాధ్యతలు స్వీకరించింది.

ఈ బృందానికి నక్సల్ నిగ్రహ దళం చీఫ్ ఎస్ సుజిత్ దాస్ నేతృత్వం వహిస్తారు. మకరజ్యోతి ఉత్సవాల సందర్భంగా 2, 500 మంది పోలీసులు మోహరించనున్నారు. వీరిలో మొదటి బ్యాచ్‌లో 10 మంది డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నేతృత్వంలో 950 మంది పోలీసు అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. మిగిలిన వారు గురువారం విధుల్లో చేరనున్నారు. ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ల నేతృత్వంలో 350 మంది పోలీసు అధికారులతో కూడిన అదనపు బ్యాచ్ జనవరి 13వ తేదీన విధుల్లో చేరనుంది.

జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పందళం ప్యాలెస్ నుంచి సన్నిధానం వరకు తిరువాభరణ ఊరేగింపు జరుగుతుందని, రాణి తహసీల్దార్ ఎం.కె.అజికుమార్ నేతృత్వంలో 10 మంది అధికారుల బృందం శోభాయాత్రలో పాల్గొంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అధికారిక అంచనాల ప్రకారం డిసెంబర్ 30వ తేదీన శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరిచినప్పటి నుంచి రోజుకు సగటున లక్ష మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు.

మకరజ్యోతి పండుగ రద్దీని తగ్గించేందుకు అధికారులు వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని తగ్గించారు. జనవరి 14వ తేదీ నుండి 50,000 మందికి మాత్రమే దర్శనానికి వసతి కల్పించారు. జనవరి 13వ తేదీ నుంచి మూడు రోజుల శోభాయాత్ర ప్రారంభం కానుంది.

LEAVE A RESPONSE