కోడికత్తి శ్రీనుకు బెయిల్.. జగన్ రెడ్డి గేమ్ ఓవర్

-తల్లి, సోదరుడు, టీడీపీ, వామపక్షాలు, దళిత, ప్రజాసంఘాల సుదీర్ఘ పోరాటం ఫలించింది
-గత ఎన్నికల్లో గెలుపు కోసం అన్యాయంగా బడుగుబలహీనవర్గాల ప్రజలను జగన్ రెడ్డి బలిచేశారు
-కోడికత్తి శ్రీనుకు బెయిల్ పై తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి

హనుమాన్ జంక్షన్: దాదాపు ఐదు సంవత్సరాలుగా కోడికత్తి శ్రీను కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పకుండా దళిత బిడ్డని జైల్లోనే ఊచల లెక్కపెట్టేలా జగన్ రెడ్డి పన్నిన కుట్రలో భాగంగా తల్లి, సోదరుడు, టీడీపీ, వామపక్షాలు, దళిత, ప్రజాసంఘాల సుదీర్ఘ పోరాటం అనంతరం నేడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి హర్షం వ్యక్తం చేశారు.

2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేయగా.. నాటి నుంచి జైలులోనే మగ్గుతున్నారు. ఇన్నాళ్లూ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్న శ్రీనివాస్​కు గురువారం నాడు హైకోర్టు బెయిల్​ మంజూరుచేసింది.

ఈ సందర్భంగా సాయి కల్యాణి మాట్లాడుతూ, కోడికత్తి శ్రీనుకి బెయిల్ రావడంతో ఇంటికి దూరమై, వృద్ధులైన తల్లిదండ్రులు, తన సోదరుడికి కొండంత దుఃఖాన్ని దూరం చేయడంతో పాటుగా జగన్ రెడ్డి పన్నిన కుట్రకి తెరపడిందని తెలిపారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం అన్యాయంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన కోడికత్తి శ్రీనుని, సొంత బాబాయిని గొడ్డలి పోటు, అబ్బదపు హామీలతో ప్రజలను జగన్ రెడ్డి బలిచేసారని సాయి కల్యాణి పేర్కొన్నారు.

ఒక పక్క నా ఎస్సీ, ఎస్టీ అంటూ మొసలి కన్నీరు కారుస్తూ, మరో పక్క జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే.. తన తప్పు తెలిసిపోతుందనే భయంతో అమాయకుడైన యువకుడి జీవితాన్ని నాశనం చేసిన జగన్‌ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో దళిత వర్గాలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Leave a Reply