Suryaa.co.in

Andhra Pradesh

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి కులపిచ్చి

-రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజికి వర్గానికే పెద్దపీట
-కాపు, బలిజలని జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారు
– టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

పదవులన్నీ తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణిచి వేస్తున్నారు. రాష్ట్రం కంటే తన సామాజిక వర్గమే ఎక్కువని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ రెడ్డి నిరూపించారు. మూడు రాజ్యసభ సీట్లలో రెండు సొంత వర్గానికి కేటాయించడమేనా జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయమంటే? రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు మొదట రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రకటించారు.

తడి ఆరక ముందే ఆయనను తొలగించి సొంత సామాజిక వర్గానికి చెందిన మేడా రఘునాధ రెడ్డికి కేటాయించడం బలిజల గొంతు కోయడం కాదా? రాజంపేట లోక్ సభ సీటు కూడా సొంత సామాజిక వర్గానికే అప్పగించారు. ఇప్పుడు మరోసారి వంచించారు. నమ్మించి మోసం చేయడం నమ్మించి గొంతులు కోయటం మీ జీన్స్ లోనే ఉంది.

బడుగు, బలహీన వర్గాలంటే జగన్ రెడ్డికి ముందు నుంచీ చిన్నచూపు. కులపిచ్చితో కక్ష కట్టి రాజకీయ అవకాశాలకు వారిని దూరం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బడుగు, బలహీన వర్గాలను అణిచివేస్తున్న జగన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.

LEAVE A RESPONSE