-సంక్షేమం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు
-పదేళ్లలో ప్రజలకు ఏం చేసేమో మనమే చెప్పాలి
-రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది
-ప్రతి పధకం వెనకాల ఒక స్కాం ఉంది
-రైతు పార్టీ అని చెప్పుకునే వైసిపి రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలి
-ఎస్ సి నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి లాంటి వాళ్ల పెత్తనం
– బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం
– పాల్గొన్న జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు
– బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ప్రారంభమైన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జి ల సమావేశం
ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏమన్నారంటే.. తెలుగుదేశం అధికారం లో ఉండ గా మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే, వైసీపీ అధికారం లోకి వచ్చి న తరువాత 12లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? సంక్షేమం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి నరేంద్ర మోడీ వల్ల పెరిగిందనే విషయం తెలిసిందే.
మహిళ ల పై అత్యాచారాలు జరిగితే దిశ యాప్ ఏమైందని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది. ఎన్నికల కు సమాయత్తం అయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి జెండా రెపరెపలాడుతుంది.. కొన్ని చోట్ల అధికారం పంచుకుంటుంది. ఎపికి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదే. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర పధకాలను వివరిస్తున్నాం.
కేంద్ర పధకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పధకాలుగా చెప్పుకుంటున్నారు …వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ఇవి కేంద్ర పధకాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. పదేళ్లలో ప్రజలకు ఏం చేసేమో మనమే చెప్పాలి. రాష్ట్ర పరిస్ధితులను మనం బేరీజు చేసుకోవాలి. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను 12 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగామార్చేసింది.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందిప్రతి పధకం వెనకాల ఒక స్కాం ఉంది.. డబ్బులు వేస్తూనే ప్రతి పధకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారు. రైతాంగం నైరాశ్యంలో కూరుకుపోయింది. మొన్న తుఫాను దాటికి రైతాంగం అనేక ఇబ్బందులు పడ్డారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైసిపి రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలి. రైతాంగం నష్టపోతే వాళ్ల దగ్గరకు వెళ్ళి అడిగిన ఒక్క నేత పేరు. బిజెపి మాత్రమే రైతాంగానికి అండగా నిలబడింది
విశాఖ లో మహిళ పై పాశవికంగా అత్యాచారం చేయడం దుర్మార్గం. దిశ యాప్ ఉందని సిఎం గొప్పగా చెప్తున్నారు మహిళలు ఫోన్ ఊపుతూనే ఉన్నారే తప్ప మహిళలకు రక్షణ కొరవడింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు. ఐదు లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన జగన్ ఏమైంది ఆ మాట?ఎస్ సి నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి లాంటి వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా అవకాశ మిచ్చారని వైసిపి ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.