యార్లగడ్డ కుమార్తెకు చంద్రబాబు ఆశీర్వచనం

– గన్నవరంలో ఘనంగా టిడిపి ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు నిర్వహణ

గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు గన్నవరం లోని ఎస్.ఎం.కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇరువురు విచ్చేసి శ్రీ సహస్రను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాజీ మంత్రులు,శాసనసభ్యులు,శాసన మండలి సబ్యులు, మాజీ శాసన సభ్యులు, పలు నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జిలు, రాష్ట్ర టీడీపీ నాయకులు, జిల్లా టీడీపీ నాయకులు, నియోజకవర్గంలోని గన్నవరం,విజయవాడ రూరల్, ఉంగుటూరు,బాపులపాడు మండలాల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ, తెలుగు రైతు, తెలుగు మహిళ, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొని శ్రీ సహస్రను ఆశీర్వదించారు.

Leave a Reply