Suryaa.co.in

Andhra Pradesh

ఆలపాటిని ఘన విజయంతో గెలిపించాలి

– ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రకాశం జిల్లా డాక్టర్ నూకసాని బాలాజీ

గుంటూరు: పట్టణంలో ఉమ్మడి కృష్ణా -గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గారి కార్యాలయం నందు గుంటూరు తూర్పు నియోజకవర్గం చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రకాశం జిల్లా డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధికి అంకితభావంతో కృషి చేసే ఆలపాటిని గ్రాడ్యుయేట్ ఓటర్లంతా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి ఆలపాటి గెలుపే గ్రాడ్యుయేట్స్ ద్యేయమని డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి, విద్యావేత్తల ప్రయోజనాలకు కూటమి అభ్యర్థుల విజయమే కీలకమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లూ కూటమి అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా నిలిచి, గెలుపునకు సహకరించాలని ఆయన కోరారు.

LEAVE A RESPONSE