భగ్గుమన్న బాపట్ల టీడీపీ శ్రేణులు

– బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వేగేశన నరేంద్ర ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన
– అసభ్యంగా మాట్లాడిన శాసనసభ్యుల దిష్టి బొమ్మలు దగ్ధం
– గుండు గీయించుకుని శపథం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
– భారీ ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు…
శాసనసభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి , వారి కుటుంబ సభ్యుల పై వైసీపీ శాసన సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ముందుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసన సభ్యులు దిష్టి బొమ్మలను తగులబెట్టారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుండుగీయించుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసి అసెంబ్లీలో అడుగుపెట్టేవరకు శ్రమిస్తాం అని శపధం చేశారు.ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు..