చంద్రబాబుతోనే బీసీలకు పూర్వవైభవం

-ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు: బీసీలంటే ప్రాణం పెట్టే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలిసిక ట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పిలపునిచ్చారు. చంద్రబాబు వస్తేనే బీసీలకు పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. మంగళవారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం 8వ క్లస్టర్‌ ఇన్‌చార్జి పఠాన్‌ సమద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. 8వ క్లస్టర్‌ పరిధిలోని బీసీ నాయకులు హాజరయ్యారు.

ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీసీ డిక్లరేషన్‌ కరపత్రాలను విడుదల చేశారు. బీసీల్లోని అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం లభించేలా బీసీ డిక్లరేషన్‌ ఉందన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌, ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ ఉప ప్రణాళిక ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 34 శాతానికి పునరుద్ధరించడం, చట్టబద్ధంగా కుల గణన చేపడతామని చెప్పారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే బీసీ డిక్లరేషన్‌ లక్ష్యమన్నారు. చిలకలూరిపేట నియోజ కవర్గంలో వందల మందికి రాయితీ రుణాలు ఇచ్చి ఆర్థికంగా బీసీలను ఆదుకున్నామని, ప్రస్తుతం 56 బీసీ కార్పొరేషన్లు పెడితే ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బీసీలకు ద్రోహం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఐక్యతతో ఉండి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply