అధికారంలోకి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సైకో పాలనను తరిమికొట్టి కూటమి పాలనను అధికారంలోకి తెచ్చుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైకో పాలన పోవాలంటే మనందరం కలిసికట్టుగా విభేదాలకు తావివ్వకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మత కులాలను రెచ్చగొట్టే విధ్వంసకర ప్రచారాలు చేస్తుందని, దానికి దీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తామో ప్రతి గడపకు వెళ్లి వివరించాలని తెలియజేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా తనను, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply