బీఆర్‌ఎస్‌కు భద్రాచాలం ఎమ్మెల్యే తెల్లం గుడ్‌బై?

– కాంగ్రెస్ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
– పార్లమెంటు ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరిక
– ఇటీవలే రేవంత్‌ను కలిసిన తెల్లం
– దానం, కడియం తర్వాత తెల్లం షాక్

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తొలుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పగా, రెండురోజుల క్రితమే మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి కూతురు కావ్యతో సహా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కూతురు కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఖరరాయింది.
తాజాగా భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేసినట్లే కనిపిస్తోంది. ఆయన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం హాజరుకావడం చర్చనీయాంశమయింది. కాగా ఇటీవలే మంత్రి పొంగులేటితో కలసి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన తెల్లం.. పార్లమెంటు ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరవచ్చని తెలుస్తోంది.

Leave a Reply