Suryaa.co.in

Devotional

భగవదర్చన

భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.
మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం.
దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం.
కూతురితో ప్రవర్తించిన విధంగానే కోడలితోనూ ప్రవర్తించడం.
ఎవరినీ ద్వేషించకుండా ఉండడం.
ఎదుటివాళ్లు మనకేమిచ్చారనే ఆలోచనలను వదిలి మనం వాళ్లకేమివ్వగలమోననే ఆలోచన చేయడం.
భగవంతుడి నామ సంకీర్తన చేయడం వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే.

1. కృతయుగంలో ధ్యానం
2. త్రేతాయుగంలో యజ్ఞాలు
3. ద్వాపర యుగంలో అర్చనలు
4. కలియుగంలో భగవన్నామ సంకీర్తనం
భగవంతుని అనుగ్రహానికి మేలైన మార్గాలు. మోక్షప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు.

ముక్తి సాధనాలు గా కర్మయోగం, రాజయోగం, భక్తియోగం, జ్ఞాన యోగం అని నాలుగు యోగాలు శాస్త్రాలలో తెలిపారు.
సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు. ఫలాపేక్ష వదలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమనీ గీతాచార్యుడు బోధించాడు.
దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామకర్మ బంధం నుండి విడిపిస్తుంది.
ప్రతి పనినీ భగవత్‌ కైంకర్యమనే భావంతో చేయాలి. ఇదే కర్మయోగం.

LEAVE A RESPONSE