శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..

1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :
కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..
2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :
గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..
3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :
ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి.. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది..
ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..
1. వనభైరవుడు
2. జటాభైరవుడు
3. గధాభైరవుడు
4. తాండవభైరవుడు.
4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :
ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు ‘మహాభైరవుడు’ లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం. నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి..
5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణలో కామారెడ్డి జిల్లా) :
సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది..దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది.ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది..
6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :
ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..
7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :
ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు.. ఒక శివలింగం.. స్థానిక చెంచుల దేవుడైన నిరాకార ‘బయన్న’ దర్శనమిచ్చును..
8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :
ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నఇర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..
9. ఖాట్మండు (నేపాల్) :
నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది.. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి.. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు..
10. భైరవకొండ (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :
ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 – 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం.. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.
11. తిరువైసనల్లూరు (తమిళనాడులో కుంబకోణం) :
ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.
12. న్యూడిల్లి :
ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.
13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :
ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..
14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో) :
స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..
15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా) :
స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..
16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :
9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.
17. కచ్ఛాద్రి (కర్నాటక లోని కొల్లూర్ దగ్గర) :
ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.

Leave a Reply