Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నపుడే అంబేద్కర్ కి భారతరత్న

-అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకోవటానికి సిగ్గుగా లేదా?
-రాష్ట్రంలోని మాలపల్లెలన్ని తిరిగి మన జాతిని చైతన్యం చేయాలి
-జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి 18 సిపార్సులు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే
-రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు చేసి దళితులకు విద్యనందించిన ఘతన ఎన్టీఆర్ దే
-సాటి వ్యక్తికి అన్యాయం జరిగితే దళిత సంఘాలు, మేధావులు నోరు మెదపకపోవటం బాధాకరం
-ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు
-దళితులకు జరుగుతున్న అన్యాయం దళిత మంత్రులకు కనిపించటం లేదా?
-వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రంలో దళితులు బ్రతకలేరు
-మాలల పంతం జగన్ అంతం
-సుబ్రమణ్యం అనే ఒక మాలోడిని చంపి డోర్ దెలివరీ చేసిన అనంతబాబుకు పూల మాలల వేసిన జగన్ రెడ్డి మనవాడా?
-లేక సుబ్రమణ్యం కుటుంబానికి అండగా నిలబడిన చంద్రబాబు మన వాడా?
-మాలోడిని చంపిన వాడికి మూడు పదవులు ఇచ్చిన జగన్ రెడ్డికి 2024 లో మాలోడి సత్తా ఏంటో చూపుతాం
-మాలల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత, కొండ్రు మురళీ, గొల్లపల్లి సూర్యారావు , పరసా రత్నం , సంతనూతలపాడు టీడీపీ ఇంఛార్జి విజయ్ కుమార్ , అధికార ప్రతినిధి మహాసేన రాజేష్

వైసీపీ పాలనలో నాలుగేళ్ల నుంచి మాలలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు వారికి జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

ముఖ్యఅతిథి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం, మర్యాద దక్కింది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు హక్కుల్ని కల్పించారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక 35 ఏళ్లు దేశంలో రాజ్యాంగం సరిగా అమలు జరగలేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కి కూడా గతంలో గౌరవం దక్కని పరిస్థితి. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నపుడే అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చి గౌరవించారు.

రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి అంటరానితనాన్ని నిర్మూలించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి 18 సిపార్సులు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. రెసిడెన్సీ స్కూల్స్ ఏర్పాటు చేసి దళితులకు విద్యనందించిన ఘతన ఎన్టీఆర్ దే.

రాష్ట్రంలోని అన్ని కులాలు, వర్గాలను గౌరవించే పార్టీ టీడీపీ. జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. టీడీపీ నిజాయితీ నిరూపించుకుంటాం.

గత ఎన్నికల్లో దళితులు గంపగుత్తగా జగన్ కి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు కూడా ఆ వర్గాలు తనకే ఓట్లు వేస్తాయన్న భావనలో జగన్ ఉన్నారు. దళితుల్లో చైతన్యం పెరిగింది, జగన్ ని ఎప్పుడూ గద్దె దించుదామా అని ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి పట్టిన శనిని వదిలిద్దాం. యువగళం పాదయాత్రకు జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేశ్ 1800 కి.మీ విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి కారణం దళిత యువతే.

జాతిలో ఎవరికి అన్యాయం జరిగినా జాతి అంతా ఐక్యంగా పోరాటం చేయాలి. కానీ సాటి వ్యక్తికి అన్యాయం జరిగితే దళిత సంఘాలు, మేధావులు నోరు మెదపకపోవటం బాధాకరం. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. నాలుగేళ్లలో దళితులపై జరిగిన దమనకాండ గతంలో ఎన్నడూ జరగలేదు. ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత యువకుడికి శిరోముండన చేశారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ పిచ్చోడిని చేసి చంపారు. కానీ వీటిపై మనం పార్టీ నేతలు తప్ప ఎవరైనా మాట్లాడారా?

దళితులకు జరుగుతున్న అన్యాయం దళిత మంత్రులకు కనిపించటం లేదా? దళిత మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడితే ప్రయోజనం ఉండదు, మీకు చేతనైతే జాతికి న్యాయం చేయండి. దళిత మహిళలపై గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాచారాలు జరుగతున్నాయి. వైసీపీ తప్పుల్ని ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ ని వేధింపులకు గురిచేశారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించకూడదా? రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా? వైసీపీ పాలన పట్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.

రాష్ట్రంలోని మాలపల్లెలన్ని తిరిగి మన జాతిని చైతన్యం చేయాలి. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రతి హామీ అమలు చేసే బాద్యత టీడీపీదే. దళిత యువకులంతా వైసీపీ పాలనలో జరిగిన అన్యాయంపై ప్రజల్ని చైతన్యం చేయాలి. లోకేశ్ మంత్రిగా ఉన్నపుడు దళిత వాడల్లో రోడ్లు, ఎల్ ఈడీ బల్బులు వేసి అభివృద్ది చేశారు. దళితుల అసైండ్ భూములు లాక్కున్న నీచుడు జగన్. నాలుగేళ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ బ్యాక్ ల్యాక్ పోస్టుల భర్తీ ఊసేలేదు.

2014-19 దళితులకు స్వర్ణయుగం, దళితుల్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వేలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించారు. కానీ జగన్ నాలుగేళ్లలో ఒక్కరికైనా రుణం ఇచ్చారా? అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకోవటానికి సిగ్గుగా లేదా?

దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కి రూ. 43 వేల కోట్లు దోచుకున్న జగన్ కి పోలికా? అంబేద్కర్ పేరు మార్చినపుడు దళిత సంఘాలు ఏమయ్యాయి? వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రంలో దళితులు బ్రతకలేరు. మాల, మాదిగలు, బలహీన వర్గాలు గౌరవంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి కావాలి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ..
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అని కులాలు దగాపడ్డాయి. అందులో మాలలు ఎక్కువగా దగా పడ్డారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారు. దళితుల్లో మాలలు 58 శాతం ఉన్నారు. దళితుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యునిటీగా మాల సామాజిక వర్గం ఉంది. 14 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతంకు పెంచిన ఘనత అన్న ఎన్టీఆర్ ది. డా. అంబేడ్కర్ కు భారతరత్న ఇవ్వాలని నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్టీఆర్ నాడు పట్టుబట్టారు.

జస్టిస్ పున్నయ్య కమీషన్ ఏర్పాటు చేసి 42 సిఫారసుల అమలుకు 18 జీవోలు తీసుకొచ్చి అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి దళిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, మొట్టమొదటి దళిత శాసనసభ స్పీకర్ గా, మొట్టమొదటి లోక్ సభ స్పీకర్ గా మాలలను నియమించిన ఘతన తెలుగుదేశం పార్టీది. ఒక్క ఛాన్స్ పేరుతో ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి దళితులను దగా చేశాడు. జగన్ రెడ్డికి మాలల సత్తా చూపించాలి. నాడు బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నట్లు నేటి మాలలు చంద్రబాబుకు అండగా నిలబడాలి.

జగన్ రెడ్డి దళిత అధికారుల భుజాలపై తుపాకీలు పెట్టి రాజకీయ ప్రత్యర్ధులను అణచివేస్తున్నాడు. నిన్నటి వరకు సిఐడీ ఛీప్ సునీల్ కుమార్ ను వాడుకుని వదిలేశాడు. నేడు అదే స్థానంలో మరో దళితుడిని పెట్టి తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఐఏఎస్ లు అయ్యా ఎస్ లు గా తయారవ్వొద్దు. సమిదలు కావొద్దు. చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాల్సిన భాద్యత మాలలు తీసుకోవాలి.
ఆయనను గౌరవ సభకు హుందాగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాలలది. జనాభా దామాషా ప్రకారం పార్టీలో, ప్రభుత్వంలో మాలలకు న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ను అధికారంలోకి తీసుకురావడానికి మాలలు సమిధలుగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాం.

శాసనసభ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి మాట్లాడుతూ..
పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మీటింగుల్లో పాల్గొన్నాను. కానీ, ఇది చాలా ప్రత్యేకమైన మీటింగ్. ఎన్టీఆర్ ప్రభుత్వంలో 15 మంది దళిత ఎమ్మెల్యేలు ఉంటే అందులో మాల స్త్రీ అయిన నేను మంత్రిగా ఉన్నాను. చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్నత విద్యాశాఖామంత్రిగా పనిచేశాను. మాలలపై అభిమానం లేకపోతే 26 ఏళ్లకే నాకు మంత్రిపదవి ఇస్తారా?

1999 లో నేను గెలిచిన తర్వాత దేశంలోనే రెండవ దళిత మహిళా స్పీకర్ గా నన్ను నియమించారు. సిక్కిం మహిళ తర్వాత శాసనసభాపతిగా ఎన్నుకోబడ్డ రెండవ దళిత స్త్రీని నేను. అది మాలల పట్ల తెలుగుదేశంకు ఉన్న ప్రేమ. దేశంలోనే మొట్టమొదటి దళిత లోక్ సభ స్పీకర్ గా బాలయోగిని నియమించింది తెలుగుదేశం పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ గానీ, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, ఆయన కుమారుడు జగన్ రెడ్డి గానీ మాలలకు ఏం చేశారు?

పార్టీలోకి పదవులు అనుభవించి తిరిగి అక్కడికే వెళ్లిపోయిన జూపూడి, డొక్కా లాంటి వారి వల్ల ఒక్కోసారి మనం నిందలుపడాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మాలలు అవిశ్రాంతంగా పనిచేయాలి. లోకేష్ బాబు గారి పాదయాత్రకు జనాలు లేరని అన్నారు. కానీ నేడు లోకేష్ బాబు వేసే ప్రశ్నలకు అధికారపార్టీకి మాటలు పెగలటం లేదు.

దళితులకు హక్కులు సాధించిన జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య కమీషన్ ను నాలుగు నెలల కొనసాగించడం ఇష్టం లేక కమీషన్ అర్హత కాలాన్ని కుదించి ఆయనను తొలగించిన ఘనుడు రాజశేఖర్ రెడ్డి. అలాంటి మాల ద్రోహులకు మనం ఓట్లు వేయకూడదు.

ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ..
చంద్రబాబు నాయుడు గారిని 4వ సారి ముఖ్యమంత్రి చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికి ధన్యవాదములు. సామాజిక భద్రత, సామాజిక న్యాయం ద్వారా పేదలను ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తమ పక్కన కూర్చునే వ్యక్తి ఒక మాల ఒక మాదిగ ఉండేలా చూసుకొని సమన్యాయం చేస్తున్నారు. జగన్ రెడ్డి మేనమామ అని కంసమామగా మారాడు – మాలల పంతం జగన్ అంతం. సలహాదారులు మేథావులకు మాత్రమే ఇస్తామని జగన్ రెడ్డి అసెంబ్లీ అన్నారు.

అంటే దళితుల్లో మేథావులు లేరా? చంద్రబాబు, లోకేష్ గారు దళితులపై మాట్లాడని మాటలను వక్రీకరించి చిత్రీకరించిన హీన చరిత్ర జగన్ రెడ్డిది. 2014-15లో జీవో నెం. 25ని సమర్ధవంతంగా అమలు చేశాం. జగన్ రెడ్డి తూట్లు పొడిచారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే సక్రమంగా అమలు చేస్తారు.

ప్రతిపక్షంలో ఉన్న మాల ఎమ్మెల్యేనైనా నాపైన దాడి చేస్తున్నారంటే అది దళిత జాతిపై దాడితో సమానమే. దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డిది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి మాలలకు ద్రోహి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. మన సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

మాజీ ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..
మాలల పంతం జగన్మోహన్ రెడ్డి పాలన అంతం. టీడీపీ వచ్చాకే సామాజిక న్యాయం సాధ్యమైంది. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాలకు న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. షెడ్యూల్ కులాలకు న్యాయం జరిగింది తెలుగుదేశం హయాంలోనే.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా దళిత వాడల్లో మౌలిక సదుపాయాల ఘనత చంద్రన్నదే. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది టీడీపీనే. టీడీపీ పాలనలోనే దళితులకు న్యాయం జరిగింది. దళిత ద్రోహి జగన్ రెడ్డి. బలహీన వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి చులకన భావం. నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. దళితులంతా సంఘటితమవ్వాలి. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి దళితుల సత్తా చాటుదాం. 19 పార్లమెంటు నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ స్థానాల్లో గెలపోటములు ప్రభావితం చేసేది దళితులే.

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ..
నిద్రావస్థలో ఉన్న మాల జాతిని మేలుకొల్పేందుకు చంద్రబాబు గారు అనుక్షణం కృషి చేస్తున్నారు. విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాలలు తిరగబడకపోతే అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానకరం అవుతుంది. ఎవరికైతే దేశ చరిత్ర, కుటుంబ చరిత్ర, మాల చరిత్ర తెలుసో, వారే మరో కొత్త చరిత్రను రాయగలరని అంబేద్కర్ అంటారు.

మాలల జీవితాలను ప్రోత్సహిస్తూ, అవకాశాలు కల్పిస్తున్న టీడీపీ అండగా ఉన్నప్పుడు మనం టీడీపీకి అండగా ఉండాలి. బొబ్బిలి, పల్నాటి యుద్ధాల్లో మాలలు చేసిన త్యాగం అనిర్వచినీయం. దేశానికి అన్నం పెట్టే వాడు రైతే అయితే రైతును ముందుకు తీసుకువెళ్లే జాతి మాల జాతి. రాజ్యాంగం సక్రమంగా అమలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. రాజ్యాంగ ఫలాలు పేద వారికి అందకుండా చేస్తున్నారు. అలాంటి పాలనకు బుద్ధి చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, మద్యం ఏరులై పారుతుంది.

మాజీ మంత్రి కొండ్రు మురళీ మాట్లాడుతూ..
మన పూజ్యులు బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో కూడు, గూడు, గుడ్డ అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండాలని అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. గురుకుల పాఠశాలలు నిర్మించడం ద్వారా పేదలందరు చదువుకొని ఉన్నతమైన విద్యను అభ్యసించి అత్యంత విలువగలిగిన వ్యవస్థల్లో ఉద్యోగస్థులుగా పనిచేస్తున్నారంటే కేవలం అన్న ఎన్టీఆర్ చేసిన కృషే.

గతంలో బూర్జువా వ్యవస్థ ఉండేది. మునుసూబులు, కర్ణాలు, ఉండేవారు. అటువంటి సమయంలో మన భూమిని మనమే రక్షించుకునే విధంగా మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టి పేదలైన ఎస్సీ,ఎస్టీలకు ఎన్టీఆర్ మేలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 14 శాతం ఉన్న రిజర్వేషన్ 15 శాతం పెంచిన ఘనత చంద్రన్నదే. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా ఎస్సీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయే.

దేశంలో అత్యంత విలువైన టెక్నాలజీని పునికిపుచ్చుకొని మాల పల్లెల్లో విద్యార్థులు చదువుకొని విదేశాలకు వెళ్లారంటే అది చంద్రబాబు నాయుడు కృషి. రాష్ట్రంలో పేదలైన ఎస్సీ, ఎస్టీల కోసం చంద్రబాబు నాయుడు 27 సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేడు జగన్ రెడ్డి రద్దు చేశారు. 2019వరకు అమల్లో ఉన్న అంబేడ్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఫీజురీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నోసంక్షేమ పథకాలు రద్దుచేశారు.

చంద్రబాబు నాయుడు కోసం మనం ప్రతి గ్రామానికి వెళ్లి పని చేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలి. రాష్ట్రంలో జగన్ రెడ్డి అనే సైకో పాలన చేస్తున్నారు. అతను ఒక ఫ్యాక్షన్ రౌడీ. అతని పాలన గురించి అందరకీ అర్థమైంది. ఒక్క చాన్స్ అని ఓట్లు వేయించుకుని మన పైనే ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. 10 లక్షల కోట్లు రూపాయలు అప్పులు చేశారు.

మనకి పుట్టే బిడ్డలపైనా రూ.2 లక్షలు అప్పుచేసిన వ్యక్తి ఈ సైకో. మనం కష్టపడి చంద్రబాబు నాయుడుని గెలిపించాలి. గతంలో ఏ ప్రభుత్వంలోనైనా ఎస్సీ,ఎస్టీ లకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఈ సైకో వచ్చాక అలాంటి అవకాశం లేకుండా పొయింది. మాలలు చైతన్యం గురించి చెప్పక్కర్లేదు. మాలలు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. లోకేష్ ది స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటిలో చదివితే జగన్ రెడ్డిది జైలు విద్య. నారాలోకేష్ గురించి మాట్లాడే సైతిక విలువ వైసీపీ సైకోలు లేదు.

మాజీ మంత్రి పరసా రత్నం మాట్లాడుతూ..
ఒక్క చాన్స్ అని దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దళితలపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా మాలలపై హత్యలు, హత్యచారాలు పెరిగిపోయిన పట్టించుకొని జగన్ రెడ్డిని గద్దెదింపుదాం. లోకేష్ బాబు గారి పాదయాత్రను విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో మరల టీడీపీ పార్టీని అధికారంలోకి తెద్దాం.

మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ..
సామాన్య టీచర్ నైనా నాకు మంత్రి పదవి ఇచ్చి అత్యంత గౌరవం ఇచ్చారు. చంద్రబాబు గారినే సీఎం చేయడమే మన లక్ష్యం. మాలలు మంచి తనానికి మారుపేరు. మాలలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెషిషన్ తీసుకోవాలని అంబేద్కర్ చెప్పారు. అలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి.
మనపైన హస్తం, ఫ్యాన్ ముద్రలు బలవంతంగా వేశారు. కాని నేడు అవ్వన్ని మారాలి. మన జాతిని మన హక్కుల్ని ముందుకు తీసుకువెళదాం. మాల ఓట్లన్ని టీడీపీకే పడతాయి. నాడు ఎన్టీఆర్ గారు మన కోసమే గురుకులాలను తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మనల్ని కార్లకు ఓనర్లుగా చేశారు. జగన్ రెడ్డి ఒక్క మాల పల్లిలోనైనా ఒక్క కి.మీ. రోడ్డు వేశారా? ఒక్కరికి లోన్ ఇచ్చారా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మాలలకు ఒక గౌరవం వస్తుంది. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి మాలలు స్వాగతం పలకాలి.

మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ..
రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా చేసిన దుర్మార్గ పాలన జగన్ రెడ్డిది. రాష్ట్రాన్ని కాపాడగలిగే సత్తా కలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే దళిత అభ్యున్నతి సాకారమవుతుంది. పార్టీ ఆవిర్భావం రోజు నుండి నేటి వరకు దళితులకు అండగా నిలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి పడే ఓట్లలో కనీసం 10వేలు మాలల ఓట్లే. మాలలు టీడీపీతో లేరు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

అన్యాయం చేస్తే నిలదీస్తాం.. ఆదరిస్తే ప్రాణమిస్తాం. ఆది నుండి ఆదుకుంటున్న టీడీపీ గెలుపుకోసం ప్రాణాలిస్తాం. 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటాం. చంద్రన్నను ముఖ్యమంత్రిని చేస్తాం. దగా చేసిన జగన్ రెడ్డిని గద్దె దింపే వరకు శాంతించేదే లేదు. మాలల పంతం.. జగన్ రెడ్డి అంతం నినాదంతో పోరాడుతాం. ప్రతి మాల పల్లెలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం.

అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జ్ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ..
తెలుగుదేశం పార్టీ మాలలకు ఎంతో గౌరవాన్ని పెంచారు. చంద్రబాబు నాయుడు గారు మొట్ట మొదటి మహిళా స్పీకర్, లోక్ సభ స్పీకర్ గా మనకే ప్రాధాన్యమిచ్చారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ 4 ఏళ్లుగా మాలలకు ఏం చేయలేదు. 27 పథకాలను రద్దు చేశారు. మాట్లాడే హక్కును మనం కోల్పోయాలా చేశారు. అత్యాచారాలు పెరిపోయాయి. మాస్క్ అడిగిన డాక్టర్ ను హింసించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ను చంపేశారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. అయినా ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు పదవి రద్దు చేయలేదు.

సంతనూతలపాడు టీడీపీ ఇంఛార్జి విజయ్ కుమార్ మాట్లాడుతూ..
స్వాతంత్ర్యానంతరం ఏ ప్రభుత్వమూ చేయనంత అన్యాయం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. చంద్రబాబు ఐదేళ్లలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. పేదలకు న్యాయం చేయడమే అసలైన సంక్షేమం.. కానీ జగన్ రెడ్డి పేదలైన దళితుల పథకాలు రద్దు చేశాడు. టీడీపీ హయాంలో రుణాలిచ్చి, వాహనాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు. దళితులకు దగా చేయడం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. జనాభా దమాషా ప్రకారం నిధులిచ్చిన ఘనత చంద్రబాబుదే. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాకారమవుతుంది.

పూతలపట్టు ఇంఛార్జ్ కలికిరి మురళీ మోహన్ మాట్లాడుతూ..
దేశ చరిత్రలో మాలల చరిత్ర గురించి రాయాలంటే పుస్తకాలు కూడా సరిపోవు. టీడీపీకి ఎప్పుడూ తోడుగా నిలిచేది మాలలు.. దళితులే. తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని ఉంటాం. మాలల ఓట్లను గంపగుత్తగా కొట్టేసుకుంటామంటే కుదరదు. వాడుపోతే వీడు.. వీడు పోతే వాడు వచ్చి మాలల్ని దగా చేస్తామంటూ చూస్తూ ఊరుకోం. పెద్దాయన మంచితనం కారణంగా ఇన్నాళ్లూ దళితులు మిన్నకుండిపోయాం.

దళితుల ఓట్లను గంపగుత్తగా గుద్దించుకుని దళితుల్నే జగన్ రెడ్డి దగా చేస్తున్నాడు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన దళితులు ఇంకా వెనుకబడే ఉన్నారు. వారి అభివృద్ధికి రాష్ట్రంలో ఆది నుండి అండగా నిలిచిన ఘనత చంద్రబాబుదే. అంబేద్కర్ తర్వాత దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించిన నాయకుడు చంద్రబాబే.

దళితులు కూలీలు కాదు.. సంపదలో భాగస్వామ్యం కల్పిస్తామన్న నాయకుడు చంద్రబాబు. జగన్ రెడ్డి పప్పు బెల్లాల పేరుతో దళితుల్ని దగా చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. జగన్ రెడ్డి ఇచ్చే చిల్లర కోసం ఆలోచిస్తామా.. అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే బాబుకు తోడుందామా? దళితులకు చంద్రన్న చేసే సంక్షేమ పథకాల అమలు గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ కూచిపూడి విజయ మాట్లాడుతూ..
2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాలలది. చంద్రబాబునాయుడు చేసిన సంక్షేమ పథకాలను మాలలకు వివరించాలి. జగన్ రెడ్డిని గద్దె దించే బాధ్యత మాలలు తీసుకోవాలి.

అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మాట్లాడుతూ..
ఇక్కడ మిమల్ని చూస్తుంటే ఇది మాలల సమావేశమా? మహానాడు మీటింగా అన్న అనుమానం కలుతోంది. మా శత్రువు జగన్ మోహన్ రెడ్డి అని మాలలు నినదించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరు మన శత్రువు ఎవరు మన మిత్రువు అని తెలుసుకున్న జాతి అభివృద్ధి చెందుతుంది. సుబ్రమణ్యం అనే ఒక మాలోడిని చంపి డోర్ దెలివరీ చేసిన అనంతబాబుకు పూల మాలల వేసిన జగన్ రెడ్డి మనవాడా? లేక సుబ్రమణ్యం కుటుంబానికి అండగా నిలబడిన చంద్రబాబు మన వాడా?

బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా మన పిల్లలకు కార్పొరేట్ విద్యనందించి, అంబేడ్కర్ విదేశీ విద్య ద్వారా ఫారిన్ చదువులు అందించి, కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కల్పించ చంద్రబాబు మనవాడా? లేక వాటిని రద్దు చేసిన జగన్ రెడ్డి మనవాడా? డా. సుధాకర్ హత్య దగ్గర నుంచి నిన్నటి కంతేరులో దళితులపై దాడి వరకు జగన్ రెడ్డే మన శత్రువు అని తెలుసుకోవాలి. 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి మాయమాటలకు ప్రతీ కులం మోసపోయింది. అలాగే మాలలు కూడా మోసపోయి జగన్ రెడ్డికి ఓట్లు వేశారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే…దళితులపై దాడులు చేసి పోలీసు కేసులు నుంచి తప్పించుకుని కాలర్ ఎగరేసి తిరుగుతున్న హంతకుల్ని పిచ్చికుక్కల్ని ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లి జైళ్లలో పెడుతాం. దళితులకు కావాల్సింది ఆత్మగౌరవం, మర్యాద…అది కావాలంటే చంద్రబాబును బలపరుచుకోవాలి. బాలయోగి ద్వారా దేశంలోని ప్రతీ ఎంపీని, ప్రధానిని ఒక మాలవాడి ముందు నిలబెట్టేలా, ప్రతిభారతి గారి ద్వారా రాష్ట్రంలో ప్రతీ ఎమ్మెల్యేను, సి.ఎంను సైతం ఒక మాల మహిళ ముందు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిది. జగన్ రెడ్డి అనే దళిత ద్రోహి గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మాలలది. మాలోడిని చంపిన వాడికి మూడు పదవులు ఇచ్చిన జగన్ రెడ్డికి 2024 లో మాలోడి సత్తా ఏంటో చూపుతాం.

సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు, పంతంగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ..
ఎప్పుడో అంతరించిపోయిన అంటరానితనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనుడు జగన్ రెడ్డి. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. నా పాటల ద్వారా జగన్ రెడ్డి అరాచకాలపై ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటా. నాపై రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు నాకు అండగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. శాసన సభలో తెదేపా జెండా ఎగురవేసేవరకు నిద్రపోను.

మాజీ జడ్పీ ఛైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ..
మాలల ఆత్మీయ సమావేశంలో పాలి భాగస్థులు చేసిన ప్రతి ఒక్కరికి సమస్కారం. అంబేడ్కర్ రాజ్యాంగమే పునాదిగా నాడు అన్న ఎన్టీఆర్ నేడు నారా చంద్రబాబు దళితుల అభివృద్ది కోసం కృషి చేశారు. మాలలు టీడీపీతోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గెలుపుకోసం కృషిచేస్తారు. మాలల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం.

క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్దిరాల మ్యాని మాట్లాడుతూ….
మాలల పంతం జగన్ రెడ్డి అంతం. క్రైస్తవులను అంతం చేయాలని చూసిన వ్యక్తి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి కుటుంబ సభ్యులంతా బైబిల్ పట్టుకొని ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. మాలలందరు ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గెలుపుకోసం కృషి చేయాలి. టీడీపీ హయాంలో ఎన్నో పథకాలు అమలు చేసి క్రిష్టియన్ లను అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే. మాలలంతా జగన్ రెడ్డి పాలనను అంతమొందించాలి.

LEAVE A RESPONSE