Suryaa.co.in

Andhra Pradesh

కసాయి ప్రభుత్వాన్ని కసిగా ఎదుర్కోవాలి

– చోడవరం కార్యకర్తలకు భువనమ్మ పిలుపు

ప్రజాస్వామ్యబద్దమైన రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని హరిస్తున్న కసాయి వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలంతా కసిగా ఎదుర్కోవాలి. రానున్న 2నెలలు పట్టుదలతో కృషి చేసి తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా దాడులు, హత్యలు చేస్తున్నారు. వాళ్లకు తెలిసింది హింసించడం మాత్రమే. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కసాయి మూకల చేతిలో నుండి రక్షించుకోవడానికి ఓటే మన ఆయుధం.

రానున్న ఎన్నికల్లో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా జరిగించుకునేందుకు, అక్రమాలు, దౌర్జన్యాలు జరగకుండా చూసుకునేందుకు యువత ముందడుగు వేయాలి.వైసీపీ మూకల కుట్రలను తిప్పికొడుతూ ఎన్నికలు జరిగే వరకు కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబుపై మీరు చూపించే ప్రేమను మేము ఎప్పటికీ మరువలేము. ఆయన కుటుంబాన్ని వదిలి, మీకోసం ఎందుకు కష్టపడుతున్నారో నేను బయటకు వచ్చాక తెలిసింది. ఆయన మీ మనిషి…మీ నుండి ఆయన్ను ఏ శక్తీ దూరం చేయలేదు.

టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

• చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం, జే.పీ.అగ్రహారం గ్రామంలో పార్టీకార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 11-09-2023న గుండెపోటుతో మృతిచెందిన దేవుడమ్మ.
• దేవుడమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• దేవుడమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి.
• దేవుడమ్మ కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE