టీడీపీ కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాయయుడును అరెస్టు చేసి జైల్లో పెట్టిన వార్త విని తట్టుకోలేక గుండెలాగిన పార్టీ కుటుంబసభ్యులను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరామర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు గ్రామం, తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్టు విప్పర్రు గ్రామంలో టీడీపీ కుటుంబసభ్యులను ఆమె ఓదార్చారు. అధైర్య పడవద్దని, తామున్నామని భరోసా ఇచ్చారు. మీ వల్లే పార్టీ నిలబడిందని చెప్పారు. తమ కోసం పనిచేస్తున్న పార్టీ కుటుంబసభ్యులను ఆదుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులతో చాలాసేపు గడిపారు.

Leave a Reply