Suryaa.co.in

Andhra Pradesh

మే 13 జగన్ రెడ్డి అహంకారం కూలిపోతోంది

-ప్రజల ఆదాయం పెంపే లక్ష్యంగా సూపర్ సిక్స్ అమలు చేస్తా
-పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం సృష్టించి పేదలకు పంచుతా
-నగరిలో ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు కల్పిస్తా
-నగరి మీటింగ్ సూపర్ హిట్.. ఎన్డీఏ కూటమి అన్ స్టాపబుల్
-160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు మన లక్ష్యం
-అన్న క్యాంటీన్‌తో అన్నం పెట్టినోడు పేదల నాయకుడా.. అన్న క్యాంటీన్లు కూల్చినోడు పేదల నాయకుడా?
-దళితులకు 27 పథకాలు పెట్టినవాడు పెత్తందారుడా.. ఆ పథకాలన్నీ రద్దు చేసినోడు పెత్తందారుడా?
సిద్ధం అంటూ రోడ్డెక్కిన జగన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలంతా సిద్ధం
-కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి వారితో పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా
-చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం ‘ప్రజాగళం’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

• నేను సైతం అని తెలుగింటి ఆడబిడ్డలంతా జగన్ రెడ్డి అరాచకాన్ని అంతమొందించి, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బయటికొచ్చినందుకు అభినందనలు.
• యువత చూపిస్తున్న ఉత్సాహం ఉధృతమై, తుపానులా మారి యువత జీవితాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టేయాలి.
• జగన్ రెడ్డి అనే అహంకారి, సైకో ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు.
• భవిష్యత్తుపై ఆశ, నమ్మకం ప్రజలందరినీ ఏకం చేసింది. ఈ సైకో తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ ఉంటుందా?
• నగరిలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే.. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది.
• సమయం లేదు మిత్రమా.. కేవలం 7 వారాలు మాత్రమే ఉంది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తా. మీ బాధ్యతగా ఓటు వేసి అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు సిద్ధపడాలి.

• ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలి. కానీ, జగన్ రెడ్డికి జవాబుదారీ తనం లేకుండా పోయింది.
• మే 13వ తేదీ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల తల రాతలు మార్చే రోజు.
• రైతన్నలకు భరోసా, యువతకు భవిష్యత్తుకు గ్యారెంటీ, చేనేతలకు ఆదరణ కల్పించే రోజు త్వరలోనే రాబోతోంది.
• బడుగు బలహీన వర్గాలను నమ్మకం, గౌరవం ఇచ్చే రోజు రాబోతోంది.
• పన్నుల బాదుడు, ధరల మోత, ఛార్జీల వాతలు లేని రోజులు రాబోతున్నాయి.
• జే బ్రాండ్స్ మద్యం, గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాలు, హింసా రాజకీయాలు లేని రోజులు వస్తున్నాయి.
• ప్రజాగళం.. ఇది ప్రజల గళం. మీరు నేను కలిసి చేసే పోరాటం.
• జగన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు.. దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికా?
• నగరి సభ చూశాక జగన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ కావడం తధ్యం.
• ముద్దులు పెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి, ఒక్క ఛాన్స్ అన్నందుకు కరిగిపోయి ఓట్లు వేశాం.
• కానీ, అధికారంలోకి వచ్చిన రోజు నుండి బాదుడే బాదుడు. పిడిగిద్దులు, దోపిడీ తప్ప ఐదేళ్లుగా ఇంకేమైనా ఉందా?
• ఐదేళ్ల పాలన చూసి జగన్ రెడ్డి అబద్దాల కోరు అని ప్రజలంతా గుర్తించారు.

• డబ్బులిచ్చి చేయించిన సర్వేలతో ప్రజల్ని తికమక చేస్తున్నాడు.
• పేటీఎం కుక్కలతో సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నాడు.
• ఇడుపులపాయలోని రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గరకు ఆయన సోదరుడు వివేకాను బాత్రూంలో లేపేసిన అవినాశ్ రెడ్డిని తీసుకెళ్లాడు.
• బాబాయిని బాత్రూంలో గొడ్డలివేటు వేసిన వారికి ఎంపీ సీటు ఇచ్చి ప్రజల్ని హేళన చేస్తున్నాడు.
• ప్రజలంతా ఆలోచించుకోవాలి బాబాయిని గొడ్డలి వేటు వేసినోడికి ప్రజలు ఒక లెక్కా?
• జగన్ రెడ్డి మోసాలకు, నమ్మక ద్రోహానికి ప్రజలు కరిగిపోతారేమో అనుకున్నా. కానీ, ఈ సభకు వచ్చిన జనాన్ని, వారి ఉత్సాహాన్ని చూస్తే అన్ని అనుమానాలు తీరిపోయాయి. గెలుపు మనదేనని ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

• రైతులకు సాగునీరు అందుతోందా? గిట్టుబాటు ధరలు ఇస్తున్నాడా? ఏ రైతు అయినా సంతోషంగా ఉన్నాడా?
• యువతకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు చేశాడా? మెగా డీఎస్సీ అన్నాడు.. ఇచ్చాడా? ఇంతగా మోసం చేసినందుకు యువత మొత్తం తిరుగుబాటు చేయాలి.
• జాబు కావాలంటే బాబు కావాలనే నినాదంతో యువత రోడ్డెక్కాలి.
• ఫస్ట్ టైం ఓటు వేసే ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నాది భరోసా. ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.
• జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి.
• జే-ట్యాక్స్ కు భయపడి కియా అనుబంధ పరిశ్రమలు, అమరరాజా బ్యాటరీస్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి ఎన్నో సంస్థలు రాష్ట్రం నుండి పారిపోయాయి.
• రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదు. గౌరవం లేదు. బడుగు బలహీన వర్గాల సమస్యలు పట్టించుకునేవారే లేరు.
• ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది.
• మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగే పరదాల వీరుడు జగన్ రెడ్డి ఇప్పుడు రోడ్డెక్కుతున్నాడు.

• అందరి జీవితాలతో ఆడుకున్న వ్యక్తిని దోషిగా చూస్తున్నారు.
• పేదల మనిషి అంటూ కొత్త రాగం అందుకున్నాడు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేసిన వాడు పేదల మనిషా పెత్తందారుడా?
• తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ప్రభుత్వాలు మారుతున్నా కొనసాగుతున్నాయి. కానీ, ఇక్కడ నేను పెట్టాననే కక్షతో రద్దు చేశాడు. కొన్ని కూల్చేశాడు.
• నగరి సాక్షిగా చెబుతున్నా.. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తెరుస్తా. ప్రతి పేద వాడి ఆకలి తీర్చే బాధ్యత తీసుకుంటా.
• పేద విద్యార్ధులకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉండాలని విదేశీ విద్య తెస్తే.. జగన్ రెడ్డి రద్దు చేశాడు.
• ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వడమే లక్ష్యంగా ఐదేళ్లలో 12 లక్షల ఇల్లు కట్టించా.
• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా రద్దు చేశాడు.

• నాడు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తే.. నేడు కేంద్రం ఇచ్చే సొమ్ము తప్ప రాష్ట్రం తరఫున రూపాయి కూడా ఇవ్వడం లేదు.
• దళిత గిరిజనులకు చెందిన 27 పథకాలు రద్దు చేశాడు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్న వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వాడు పేదల మనిషా.. పెత్తందారుడా?
• పేద విద్యార్ధులకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా తెచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన పెత్తందారుడు జగన్ రెడ్డి.
• పిల్లలందరికీ ఫీజు నేరుగా కాలేజీలకు చెల్లించాను. కానీ ఫీజులు ఎగ్గొట్టిన పెత్తందారుడు జగన్ రెడ్డి.
• నేను ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. పెంచబోను అని ధైర్యంగా ప్రకటించాను.
• కానీ, జగన్ రెడ్డి ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరగ్గొట్టాడు.
• మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని రూ.60 బాటిల్ రూ.200కి అమ్ముకుంటూ తాడేపల్లి ఖజానా నింపుకుంటున్నాడు. కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీశాడు. ఇలాంటి వ్యక్తిని ఉపేక్షిస్తామా?

• దేశంలోని ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో.. ఈ ఒక్కడికే అంతకంటే ఎక్కువ ఆస్తి ఉంది.
• ఐదేళ్లలో ప్రజల ఆదాయం పెరగలేదు. ఆస్తులు పెరగలేదు. కానీ, జగన్ రెడ్డి ఆదాయం మాత్రం కుప్పలు తెప్పలుగా పెరిగింది.
• పేదల్ని నిరుపేదల్ని చేసిన పెత్తందారుడు జగన్ రెడ్డి.
• రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేస్తున్న జలగ ఈ జగన్ రెడ్డి.
• పేదల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నేను తీసుకుంటా.
• జగన్ రెడ్డీ.. సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని, నీ అరాచకాన్ని మే 13న బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారు.
• మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది. పెత్తనం పడిపోతుంది. అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వబోతోంది.
• సిద్ధం అంటున్న నిన్ను ఓడించి , నీ సింహాసనాన్ని కూల్చేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారు.

• రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలి పుట్టుకను ప్రశ్నించారంటే.. తల్లిని అవమానించినట్లు కాదా? మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలో ఆలోచించండి.
• ఆడబిడ్డల్ని గౌరవించుకునే చోట అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. కానీ, ఆడబిడ్డల్ని అవమానించే చోట రాక్షసులు కొలువై ఉంటారనడానికి జగన్ రెడ్డి రాక్షస మూక నిదర్శనం.
• మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడేది లేదు. జగన్ రెడ్డి కూడా బాగుపడేది లేదు.
• కష్టబడతా. సంపద సృష్టిస్తా. ప్రజల ఆదాయం పెంచుతా. రూ.10 ఇచ్చి ఆ సొమ్ముతో రూ.100, రూ.1000 చేసుకునే ఆదాయ మార్గాలను చూపిస్తా.
• ఎలా ఇస్తారని జగన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు.
• ఆడబిడ్డ నిధితో ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఎంత మంది ఉన్నా అందరికీ ఇస్తా.

• తల్లికి వందనంతో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికీ ప్రతి ఒక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తా.
• మన పిల్లలే మన సంపద. మన యువతను కాపాడుకుంటే ప్రపంచాన్ని ఏలే సత్తా ఉంది. వారిని కాపాడుకుంటా.
• గతంలో దీపం పథకంతో లక్షలాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. జగన్ రెడ్డి వచ్చాక గ్యాస్ వాడేందుకు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే నా తెలుగింటి ఆడబిడ్డకు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా.
• ప్రతి ఆడబిడ్డా ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పిస్తాను.
• రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతే రాజు.. ఆ విధంగా రాజును చేసే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి రైతుకు అన్నదాతతో ఏటా రూ.20 వేలు ఇస్తా.
• మరోవైపు విత్తనాలు, ఎరువులు సబ్సిడీతో ఇస్తా. డ్రిప్ ఇరిగేషన్ మళ్లీ ఇస్తా. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. ప్రతి ఎకరాకూ నీరిచ్చి రాయలసీమను రత్నాలసీమగా మార్చే బాధ్యత తీసుకుంటా.
• అధికారంలోకి వచ్చిన తొలి రోజునే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం పెడతా. 60 రోజుల్లోనే పూర్తి చేస్తా.

• మనం వస్తేనే పరిశ్రమలు తరలివస్తాయి. అది మన బ్రాండ్. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా.
• ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి అందిస్తా.
• ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తా. ఉచితంగా తాగునీరు అందించి తీరుతా.
• ప్రతి నెలా ఒకటో తేదీన రూ.4 వేల పెన్షన్ ఇంటి వద్దకే అందిస్తా. రూ.200 పెన్షన్ రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ రెడ్డి రూ.వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టింది. కానీ అధికారంలోకి రాగానే రూ.4వేలు చేస్తా.
• గతంలో మాదిరి మూడు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకునేలా చర్యలు తీసుకుంటా.
• బీసీలందరికీ 50 సంవత్సరాలకే రూ.4000 పెన్షన్ అందించి తీరుతా.
• కరెంటు ఛార్జీలు పెంచబోను. నాణ్యమైన కరెంటు అందించి తీరుతా. ఎలాంటి ఆంక్షలు లేని సంక్షేమం అందిస్తా.

• అన్న క్యాంటీన్లన్నీ తెరుస్తా. అవసరమైన ప్రతి చోటా కొత్త క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాను. ప్రతి పేద వాడికి కడుపునిండా అన్నం పెట్టే బాధ్యత తీసుకుంటా.
• ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దేవస్థానాల్లో అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని నేను మరింత పటిష్టం చేశాను. కానీ, వాటిని కూడా జగన్ రెడ్డి నాశనం చేశాడు. వాటి నిర్వహణను గాలికొదిలేశాడు.
• కల్తీ మద్యాన్ని నిషేధిస్తా. ధరలు, అమ్మకాలను నియంత్రిస్తా.
• నగరి అంటేనే చేనేతలు గుర్తొస్తారు. గతంలో 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాను. చేనేతల కోసం ప్రత్యేకంగా పాలసీలు తీసుకొస్తాను.
• నగరికి నీళ్లందించేందుకు వేణుగోపాల సాగర్ పనులు ఆగిపోయాయి. హంద్రీనీవా నిలిచిపోయింది. వాటిని పూర్తి చేసి తీరుతా.

• నగరిలో ప్రతి ఎకరాకు నీళ్లందించే బాధ్యత నేను తీసుకుంటాను.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు జనాభా దమాషా ప్రకారం నిధులిస్తా. రద్దు చేసిన ప్రతి పథకాన్ని పునరుద్దరించి ఆయా వర్గాల స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తాను.
• నగరి, పుత్తూరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు నీరు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని పూర్తి చేసితీరుతా.
• నగరిలో జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది. ఆమె నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.
• భువనేశ్వరి అనే అమ్మాయి మున్సిపల్ ఉద్యోగం ఇస్తానని రూ.40 లక్షలు వసూల్ చేసి మోసం చేసింది.

• ఆడబిడ్డకు అండగా ఉండాల్సింది పోయి లంచాలు బొక్కేయడానిక సిగ్గుపడాలి.
• వడమాల పేటను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం 150 ఎకరాలిస్తే, తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి దోచేశారు.
• పవర్ లూమ్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని ఇదే వేధికగా చెప్పిన జగన్ రెడ్డి అమలు చేశాడా? మాటిచ్చి మోసం చేయడమే కాకుండా.. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు.
• ఈ సభా వేధికగా చెబుతున్నా చేనేత కార్మికులకు 500 ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతా. మాటపై నిలబడతా.. చేనేత కార్మికుల్ని ఆదుకుంటా.
• నిండ్ర, నేతం షుగర్ ఫ్యాక్టరీల బకాయిలు చెల్లిస్తానని జగన్ రెడ్డి మోసం చేశాడు. కానీ, వాటిని తెరిచే బాధ్యత తీసుకుంటా.
• విజయపురం మండలంలో ఏపీఐఐసీ కోసం 1500 ఎకరాల భూమిచ్చా. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఉద్యోగం కల్పించలేదు.

• చెన్నైకి 60 కి.మీల దూరంలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అందుకే ఇక్కడ భారీ టెక్స్ టైల్స్ పార్క్ పెట్టాలేది నా ఆకాంక్ష. దాన్ని అమలు చేసి నగరిని ఇండస్ట్రియల్ టౌన్ షిప్ గా చేసి, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తాను.
• పొత్తుపై ప్రశ్నించేవారికి చెబుతున్నా. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అభివృద్ధిలో వెనకబడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, పురోభివృద్ధి సాధించేందుకే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.
• కేంద్రంలోని ఎన్డీఏతో కలసి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తా, పరిశ్రమలు స్థాపించి తీరుతా.
• వైసీపీ విముక్త రాష్ట్రమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుకే ఆయనతో కలిసి ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో గాడితప్పిన పాలనను గాడిలో పెట్టితీరుతా.

• 2014లో మనం అధికారంలోకి వచ్చి విభజన గాయాలను చెరుపుకుంటూ అభివృద్ధి బాటలో నడిపించాను. 2019లో కూడా అధికారంలోకి వచ్చి ఉంటే.. రాష్ట్రాన్ని తెలంగాణ కు ధీటుగా మార్చుకునే వాళ్లం.
• అందరినీ ఆదుకునే భరోసా ఇస్తున్నా. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతా.
• ఎన్డీఏకు 400 ప్లస్ సీట్లు అని చెబుతున్నారు. ఏపీలో కూడా 160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలి. కడప కూడా మనదే. వైనాట్ పులివెందుల మన నినాదం కావాలి.
• ప్రజల్లో కూడుగట్టుకున్న ఆవేదన జ్వాలాగ్నిగా మారి.. వైసీపీ భష్మం కాబోతోంది. కావాలి కూడా.
• జగన్ రెడ్డి మేము సిద్ధం అంటున్నాడు. కానీ, ప్రజాగళం ముందు కుప్పిగంతులు పనికిరావని గుర్తుంచుకోవాలి.
• ఎన్నికల కోడ్ వచ్చింది. ఎవరూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలు తీసుకుందాం.
• నగరిలో ప్రజల ఉత్సాహం నాలో మరింత జోష్ నింపింది.
• జగన్ రెడ్డిలా.. నా దగ్గర దోచుకున్న వేల కోట్ల డబ్బు లేదు. ప్రైవేటు సైన్యం లేదు. అరాచకం లేదు. నేరాలు చేసే మనస్తత్వం లేదు. కానీ, నేరస్తుల్ని మట్టి కరిపించే ధైర్యం నాలో ఉంది.

• ప్రజల కోసం నేను నిరంతరం పోరాడాను. కొంత మంది నాపైనే 24 క్లైమోర్ బాంబులు పేల్చారు. సాక్ష్యాత్తు ఏడు కొండల స్వామి నాకు అండగా నిలిచాడు. నన్ను కాపాడాడు.
• మేము సభలు పెడుతుంటే కరెంటు కట్ చేస్తున్నారు. మైకులు కట్ చేస్తున్నారు. ప్రధాని సభల్లో కూడా మైక్ కట్ చేసి, మాకు మైకు పెట్టుకోవడం చేతకాదు అంటున్నారు. మైక్ పెట్టుకోవడం కాదు.. తేడాగా వ్యవహరిస్తే తోకలు కత్తిరిస్తా.
• ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తే కబడ్దార్.
• టీడీపీ గెలుపు అన్ స్టాపబుల్.
• చిత్తూరు ఎంపీగా కందిమల్ల దుర్గాప్రసాద్, నగరి ఎమ్మెల్యేగా గాలి భాను ప్రకాశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.

• ఎన్నో సర్వేలు చేసిగానీ, అభ్యర్ధుల్ని ఎంపిక చేయలేదు. ప్రజలు మెచ్చిన వ్యక్తికి సీటు ఇచ్చా. అలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. ముద్దు కృష్ణమనాయుడిని మరిచేలా ప్రజా సేవ చేసేలా వెనకుండి ప్రోత్సహిస్తా.
• గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. వారితో పని చేయించి, అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకూ చేరే బాధ్యత నేను తీసుకుంటా.
• ప్రజా సేవ చేసే వారికి, ప్రజలు మెచ్చిన వారిని చట్ట సభలకు పంపించినపుడే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతాయి.
• రాష్ట్రంలో ఎన్నికలు ఏకపక్షం కాబోతున్నాయని ఇక్కడకు వచ్చిన జనసందోహమే సూచిస్తోంది.
• కానీ, ప్రజలు ఏమారొద్దు. అటువైపు రాక్షస మూక ఉంది. మనం ఎదురొడ్డి తిరగబడినపుడే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. అభివృద్ధి సాకారమవుతుంది.

LEAVE A RESPONSE