లిక్కర్ డబ్బులెక్కడ ఉన్నాయో కోర్టుకే చెబుతారు

– శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే
– కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు. కేజ్రీవాల్‌కు డయాబెటిస్ ఉందని, షుగర్ లెవల్స్ సరిగ్గా లేవన్నారు. గడిచిన రెండేళ్లలో ఈడీ 250 పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిందని ఒక్క పైసా దొరలేకదన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఎలాంటి డబ్బులు దొరకలేదని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడన్నారు. తన శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే ఉందని వెల్లడించారు.

Leave a Reply