Suryaa.co.in

Telangana

అందుకే బిల్లా రంగాలు బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు

-బిల్లా రంగాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
-బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి
-టిఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎప్పుడో మొదలైంది
-కెసిఆర్ బయటకు వచ్చిన చేసేదేమీ లేదు
-రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే
-టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పార్టీలో రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నియమించే అధికారాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బదిలీ చేస్తూ పీఈసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

దేశాన్ని విభజించి పాలించు అనే విధానంతో బీజేపీ ముందుకెళుతోంది.పదేళ్లు గడిచినా విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు.బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ కారిడార్.. ఇలా తెలంగాణ పై కేంద్రం నిర్లక్ష్యం వహించారు.

నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామన్న మోదీ.. చిల్లిగవ్వ ఇవ్వలేదు..కేసీఆర్ అడగలేదు.. మోదీ ఇవ్వలేదు..ఇక ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమె..మోదీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి…రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ… కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు.

కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే.. మోదీ దేశ ప్రజలపై రూ.100 లక్షల కోట్ల అప్పు మోపారు.విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటోంది.దేశ సమైక్యతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారు.

దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది.ఇందుకు తెలంగాణలో 17కు 17 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలవాలి.రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు బీఆరెస్ ను ఎప్పుడో బొంద పెట్టారు. ఇక దించాల్సింది.. ఓడించాల్సింది నరేంద్ర మోదీని.

బీజేపీ, బీఆరెస్ వి కుమ్మక్కు రాజకీయాలు.. అందుకే బిల్లా-రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు..కాంగ్రెస్ ను నిలువరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న బీఆరెస్ చీకటి ఒప్పందం ప్రజలకు అర్ధమైంది..

విభజన హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో 17కు 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలవాలి.ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరిస్తాం..

రాజకీయ కుట్రతో గవర్నర్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసే కుట్ర చేశారు.చెప్పులు మోసే వారితో కోదండరాం గారితో పోలికనా?ఓటమితో మతిస్థిమితం కోల్పోయి.. బిల్లా రంగాలు ఉనికిని కాపాడుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో సోనియా గాంధీ గారిని పోటీ చేయాలని కోరాం..సోనియమ్మ తెలంగాణలో పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించాలి.బీఆరెస్ ఎమ్మెల్యేలే కాదు.. కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యలపై నన్ను కలవచ్చు.నేను అందుబాటులో లేకుంటే ఉప ముఖ్యమంత్రిని కలవచ్చు..

ప్రజా సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది.సీఆర్ కామారెడ్డిలోనే చిత్తుగా ఓడిపోయారు.. ఆయన బయటకు వస్తే జరిగేదేమీ లేదు.బీఆరెస్ దోపిడీపై విచారణ ఎప్పుడో మొదలైంది.దేవుడితో రాజకీయాలను ముడి పెట్టొద్దు.

LEAVE A RESPONSE