Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్ట్

– మాడుగులలో వైసీపీ వర్సెస్ బీజేపీ
– డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు అనుచరుల దౌర్జన్యం
– పోలీసుస్టేషన్ ముందు రమేష్ ధర్నా
– రమేష్ ఉన్న పోలీసు వాహనంపైనే వైసీపీ దాడి
– రమేష్ కారు, పలు వాహనాలు ధ్వంసం
– అయినా ముత్యాలనాయుడుపై కేసు పెట్టని పోలీసులు
– హత్యాయత్నం కేసు పెట్టాలని రమేష్ డిమాండ్
– చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
– రమేష్ అరెస్టును ఖండించిన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
– కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీకి సాగలబడుతున్న ఖాకీలు
– బీజేపీ నేతల రక్షణకే దిక్కులేని వైనం
– అమిత్‌షా పర్యటన ముందు ఏపీలో ఖాకీల అరాచకం
-ఈసీ ప్రేక్షకపాత్రపై కూటమి కన్నెర్ర
(అన్వేష్)

కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాసేందుకు సహజంగా భయపడతారు. కానీ ఏపీలో పరిస్థితి అందుకు విరుద్ధం. కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు నిర్భయంగా,  అధికార వైసీపీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తున్న దృశ్యాలు..  అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని మాడుగులలో సాక్షాత్కరించాయి. కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందు జరిగిన ఈ ఘటన.. ఏపీలో పోలీసులు నిర్భయంగా ైవె సీపీకి కొమ్ముకాస్తున్నారన్న నిజాన్ని  బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి జాతీయ పార్టీ అభ్యర్ధులు, నేతల రక్షణకే దిక్కులేకపోతే..  ఇక కూటమి అభ్యర్ధుల మాటేమిటన్న ప్రశ్న తెరపైకొచ్చింది. ఇంత జరుగుతున్నా ఈసీ ప్రేక్షకపాత్ర పోషించడం కూటమిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టుతో,  మాడుగుల అట్టుడికింది. కూటమి కార్యకర్త రక్షణ కోసం వెళ్లిన రమేష్‌ను పోలీసులు నిర్బంధించారు. దానితో ఆగ్రహించిన ఆయన, కార్యకర్తలతో కలసి పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అది తెలుసుకున్న అనకాపల్లి ఎంపీ వైసీపీ అభ్యర్ధి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. దీనితో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తారువలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న గంగాధర్ ఇంటివద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి చేరుకున్న ముత్యాలనాయుడు..  కూటమి నేత గంగాధర్‌ను చెప్పుతో కొట్టడంతో కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితులు దే వరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచిత్రంగా పోలీసులు వారిపైనే కేసులు పెట్టడంపై కూటమి నేతలు విరుచుకుపడ్డారు. సమాచారం తెలుసుకున్న సీఎం రమేష్  పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ముత్యాలనాయుడిపై హత్యాయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. గంగాధర్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన రమేష్‌ను పోలీసు అడ్డుకున్నారు. అయినా తాడువ గ్రామానికి చేరుకున్న సీఎం రమేష్ , బాధితుని పరామర్శించేంత వరకూ కదిలేదని భీష్మించారు.

అదే సమయానికి ముత్యాలనాయుడు కూడా అదే గ్రామంలో ఉండటంతో, హైటెన్షన్ ఏర్పడింది. దానితో రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంపై తరలించే సమయంలో,  వైసీపీ మూకలు తెగబడ్డారు. పోలీసు వాహనంలోని రమేష్‌తోపాటు, పోలీసు వాహనాలు, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. ఆ సందర్భంగా సీఎం రమేష్ చొక్కా చినగడంతోపాటు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. దీనిని ఈసీ దృష్టికి తీసుకువెళతామన్నారు.  రమేష్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి అభ్యర్ధులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా విజయం తమదేనన్నారు.

LEAVE A RESPONSE