Suryaa.co.in

Andhra Pradesh

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే హామీలు గాలికి కొట్టుకుపోతాయి

-రాష్ట్రంలో ఆ పార్టీకి జగన్‌, బాబు తొత్తులు
-వారికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు

కడప, మహానాడు: కడప టౌన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బహిరంగ సభలో కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. బాబు, జగన్‌ ఇద్దరు బీజేపీకి తొత్తులు. బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోంది. ఆ మంటల్లో బీజేపీ చలి కాచుకుంటోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు వైఎస్‌ 4 శాతం రిజర్వేషన్లు తెచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుంది. మతపరమైన రిజర్వేషన్లు అని చెబుతోంది. వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు ఇచ్చే రిజర్వేషన్లు మతపరం ఎలా అవుతాయి?

బీజేపీ వ్యాఖ్యలను జగన్‌ ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు. మణిపూర్‌లో క్రిస్టియన్‌ల ఊచకోత జరుగుతుంటే నోరు విప్పలేదు. పార్లమెంట్‌లో చట్టాలు చేస్తుంటే ఈ జగన్‌..ఈ బాబు మౌనం వహించారు తప్పితే నోరు విప్ప లేదు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి చట్టాలు తెచ్చి బీజేపీ ముస్లింల మధ్య చిచ్చు పెడుతుంది. ఇంత జరుగుతున్నా వైఎస్‌ వారసుడు ఒక్క నాడు స్పందించలేదు. బాబు బీజేపీకి పొత్తు…జగన్‌ బీజేపీ తొత్తు అని మండిపడ్డారు. ఇద్దరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో వస్తేనే ముస్లింలకు భద్రత కల్పిస్తుందని చెప్పారు.

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే హామీలు గాలికి కొట్టుకుపోయాయి
ఇచ్చిన హామీ అధికారాన్ని అక్రమాలకు వాడుకుంటున్నారు. కడపలో వైసీపీ ముఖ్యులంతా ఒక ముఠాగా తయారయ్యారట. డిప్యూటీ సిఎం ఆంజాద్‌ బాషా, మల్లికార్జున్‌ రెడ్డి, మేయర్‌, రవీంద్రనాథ్‌ రెడ్డి అంతా దోపిడీమయం చేశారట. ప్రభుత్వ భూములు దోచేశారట. ఈనాటికీ కడపలో వారు చేసిన అభివృద్ధి శూన్యం. కనీసం తాగునీరు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.

LEAVE A RESPONSE