Suryaa.co.in

Andhra Pradesh

మచ్చలేని పార్టీ బిజెపి

– బీజేపీ కండువా కప్పుకున్న అమ్మ హాస్పిటల్ డాక్టర్లు దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమార్ ల తో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ దేవీ
– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ ఎంఎల్ఏ సుజనా చౌదరి
– మచ్చలేని పార్టీ కావడతో బిజెపిలో చేరాం : డాక్టర్ దంపతులు
– ఎంపీ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి

విజయవాడ: ఏపీ బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ గా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అభివర్ణించారు. అసెంబ్లీలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి వస్తుంది. బిజెపి వాణి ఎప్పుడూ ప్రజా వాణి. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం బిజెపి విధానం.

రాజకీయంలో మచ్చలేని పార్టీ బిజెపి అని చెప్పగలం. వేలెత్తి చూపలేని పార్టీగా మోదీ పాలనలో బిజెపి ఉంది.గతంలో స్కాముల ప్రభుత్వాలు చూసాం.. మోదీ నేతృత్వంలో స్కీముల ప్రభుత్వాం చూస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 52% ఓట్లు బిజెపికి వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది. బీజేపీలో చేరికలు కొనసాగుతాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పినట్టు పశ్చిమ విజయవాడలో తగ్గిన 50వేల ఓట్లు కూడా బిజెపికి వస్తాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి బిజెపి లో చేరిన వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి,బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE