Suryaa.co.in

Andhra Pradesh

బిజెపి కార్యకర్తల పార్టీ

-సుపరి పాలన బిజెపికి సాధ్యం
-డబుల్ ఇంజన్ తోనే రాష్ట్రాభివృద్ధి
-జయప్రకాష్ పాదయాత్ర అభినందనీయం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బిజెపి విజయసంకల్ప పాదయాత్ర (విజయ సంకల్ప సభ) ముగింపు సభ ఈరోజు గుంటూరులోని హిందూ కాలేజ్ గ్రౌండ్స్ నందు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖాదీ కమిషన్ మెంబర్ లలిత్ షా విశిష్ట అతిథిగా నరేంద్ర కుమార్ విచ్చేశారు చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రజాసమస్యలను క్షేత్ర స్ధాయిలో పర్యటనల ద్వారా తెలుసుకోవటానికి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించటానికి బిజెపి పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాశ్ నారాయణ 18 రోజులపాటు నిర్వహించిన విజయ సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించింది. ఈ యాత్ర ముగింపు సభ ఈ రోజు గుంటూరు లో నిర్వహించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ,..బిజెపి రాష్ట్రాభివృధ్దికి చేసిన సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లిన జయప్రకాష్, పార్టీ కార్యకర్తలు అభినందనీయులు. బిజెపి కార్యకర్తల పార్టీ. కేవలం వారి బలాన్నే నమ్ముకున్న పార్టీ. పార్టీ ఆవిర్భవించినపుడు అధికారంలోకి వస్తుందని ఎవరూ నమ్మలేదు.

ఎందరో మహానుభావుల కృషితో ఇద్దిరినుండి 303 మంది పార్లమెంటు సభ్యులకు చేరటం కేవలం పార్టీ కార్యకర్తల కష్ట ఫలమే. ఎందరో మహానుభావులు ఇచ్చిన మూల సిధ్దాంతమే అంత్యోదయ. దానినుండి స్ఫూర్తి పోందిన బిజెపి 2014 లో సబ్ కే సాధ్ సబ్ కా వికాస్ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తే, ప్రజలు విశ్వసించి, గెలిపించారు.

అప్పటివరకు అధికారంలో ఉన్న యుపిఏ నాయకత్వం ధృడమైన నాయకత్వం ఇవ్వలేని సమయంలో, కేవలం స్కామ్ లకే పరిమితమైన క్రమంలో మంచి నాయకుడు కావాలని భారతీయులు బిజెపిని ఆదరించారు. ఈ పదేళ్లలో బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం మోదీ నాయకత్వంలో సుపరిపాలనను అందించింది.

అంతర్జాతీయ సర్వేలు కూడా గడచిన అయదేళ్లలో 12 శాతంమంది ప్రజలు మన దేశంలో పేదరికం నుండి బయటపడ్డారని తెలుపుతున్నాయి. మోదీ నాయకత్వంలో సుపరిపాలనను అందించటం, పేద, బడుగు బలహీన వర్గాల వారికోసం సంక్షేమ పధకాలు అమలుచేయటమే దీనికి కారణం.

జన్ ధన్ యోజన, జీవన్ జ్యోతి, జీవన్ సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పధకాలు, మహిళల ఆత్మ గౌరవంకోసం మరుగుదోడ్ల నిర్మాణం వంటివి పేదవారికి సంక్షేమమే పరమావధిగా రూపోందించారు. మోదీ పార్లమెంటులో మొదటి సారి అడుగుపెట్టినప్పుడు పార్లమెంటు మెట్లకి నమస్కరించి, దేశ సేవకుడిని అని లోపలికి అడుగుపెట్టారు. ఆరోజునుండి ఈరోజు వరకు కూడా దేశప్రజల సేవకునిగానే ఆయన ముందుకు వెళ్తున్నారు.

2014 జూన్ 2న నవ్యాంధ్ర ఏర్పడినపుడు మోదీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రబుత్వం అన్ని రకాలుగా సహకారం అందించింది. ప్రతి బిజెపి కార్యకర్త కూడా ఎపిలో అభివృధ్ది కేంద్రంతోనే సాధ్యమని చెప్పగలరు. నాలుగుకోట్ల ఇళ్లు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే, మన రాష్ట్రానికే 22 లక్షలు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణానికై లక్షా 80 వేలు కేంద్రం ఇస్తుంటే, రాష్ట్ర సహకారం మాత్రం అందటం లేదు.

పేద మహిళలను కట్టెలపోయ్యి పోగనుండి కాపడటానికి పది కోట్లమందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత బిజెపి పార్టీదే. విక్సిత్ భారత్ సంకల్ప యాత్రలో అన్ని పధకాలు అక్కడికక్కడే పోందే అవకాశం కల్గించాము. ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా ఉచితంగా 5 లక్షల ఆరోగ్య సేవలు కేంద్రం అందిస్తుంటే, రాష్ట్రం అందిస్తున్న ఆరోగ్య శ్రీ సేవలకు మాత్రం ఆసుపత్రులలో లభించటం లేదు. పాత బిల్లులు పెండింగ్ లో ఉండటమే దీనికి కారణం.

కానీ ఆయుష్మాన్ భారత్ కార్డులతో మాత్రం దేశ వ్యాప్తంగా ఎక్కడైనా అయిదు లక్షల విలువ చేసే వైద్య సేవలు పోందవచ్చు.దేశంలో 80 కోట్లమంది ప్రజలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తోంది.

కరోనా సమయంలో ప్రారంభించిన ఈ పధకం సెకండ్ వేవ్ తరువాత కూడా నాలుగేళ్లపాటు కోనసాగుతూ, రానున్న అయిదేళ్లు కూడా కోనసాగిస్తున్నారు. కేంద్రం ఇన్ని చేస్తుంటే, రాష్ట్రాభివృధ్దికి బెజెపి సహకరించటంలేదని నిందిస్తున్నారు. ఏఅభివృధ్ది కార్యక్రమంలోనైనా బిజెపి భాగస్వామ్యంలేదని నిరూపించమని సవాల్ చేస్తున్నాను.

ఇంతుకుముందున్న పార్టీగానీ, ఇప్పుడున్న పార్టీ గానీ, ఇప్పటివరకు మనరాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగానే మిగిల్చాయి. వైసిపి మూడు ముక్కలాటతో కోత్త ఆటకు తెరలేపటాన్ని నిరసించాలి. బిజెపి అమరావతే రాజధాని అన్న మాటకు కట్టుబడే 2500 కోట్ల రూపాయలు రాజధానికి కేటాయించింది.

అనంతపురం నుండి 29 వేలకోట్ల తో రాయలసీమను రాజధానితో కలుపుతూ రహదారులు నిర్మించటానికి ప్రతిపాదనలు రాజధాని అమరావతే అని విశ్వసించటమే కారణం. విజయవాడలో బెంజి సర్కిల్, కనకదుర్గ ఫ్లై ఓవర్ లు కూడా రాజధాని అభివృద్దిలో భాగమే. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపింది బిజెపి నే.

రివర్స్ టెండరింగ్ పేరుతో వైసిపి ప్రబుత్వం సంవత్సరంపాటు పోలవరాన్ని ఆలశ్యం చేసి, వారికి కావలసిన వారికి కట్టబెట్టటం మన రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే. పునరావాసం కల్పించాల్సిన వారి సంఖ్య కేంద్రానికి అందించాలి.

పూర్తిగా కేంద్రం నిధులతో పోలవరం నిర్మించటానికి కేంద్రం కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదాను అవసరమైనప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రబుత్వం వాడుకుంటోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకి బదులు ప్యాకేజి కి సమ్మతించి, ఇప్పుడు మడమ తిప్పటం అన్యాయం. మోదీ కేంద్రంలో అందిస్తున్న సుపరిపాలనను మన రాష్ట్రంలోకూడా తెచ్చుకుందాం. గడచిన 9 సంవత్సరాలలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఓక్క అవినీతి మరక కూడా లేదు.

అంకిత భావతం పనిచేసే కార్యకర్తలు కూడా పార్టీకి అధ్యక్షులయే సంస్కృతి ఓక్క బిజెపి లోనే ఉంది. పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు, ఏవీ అవసరమైనన్ని లేని పరిస్ధితులలో కరోనా వస్తే, దానిని ధైర్యంగా ఎదుర్కోని, వాటన్నింటినీ ఇతర దేశాలకు కూడా సరఫరా చేసే విశ్వగురుగా మన దేశాన్ని మోదీ తీర్చిదిద్దారు.

సర్జికల్ స్ట్రైక్ లతో దేశాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది మోదీనే. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించటమే సుపరిపాలన అని బిజెపి ఆలోచన. 144 కోట్లమంది ప్రజలకు పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘతన కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదే.

ఖాదీ కమీషన్ సభ్యులు లలిత్ షా మాట్లాడుతూ, బిజెపి ఎపి లో చేస్తున్న పోరాటం గుజరాత్ ను గుర్తుకు తెస్తోంది. గుజరాత్ లో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి తిరుగులేకుండా పాలిస్తున్నాము. గుజరాత్ లో అన్నిరకాలుగా అభివృధ్ది చేసి, దేశాన్ని తనవైపు తిప్పుకుంది. అలాగే ఎపి లో కూడా మనం జయకేతనం ఎగురవేస్తాము, మన చరిత్ర రాస్తాము. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 2014 నుండి దేశంలోని వివిధ రంగాలలో మార్పులు తెచ్చంది.

ప్రస్తుతం ఎపిలో కేంద్ర పధకాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి వాడుకుంటోంది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలలో అభివృధ్ది పధకాలు అన్నీ బిజెపి ప్రభుత్వం అందిస్తున్నవే. 2014 కు ముందు దేశంలో పరిస్ధితికి, ఇప్పటికి మీరు మార్పు గమనించారు. యువత భవిష్యత్తు బిజెపి చేతిలోనే ఉంది.

లోక్ సభలో మహిళా రిజర్వేషన్లతో సహా అన్ని హామీలను మోదీ నెరవేర్చారు. దానికి నిదర్శనంగా ఈ సభ కనిపిస్తోంది. బిజెపి కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రంలోని మన ప్రభుత్వం మనకి అండగా ఉంటుంది. రానున్న ఎన్నికలలో బిజెపి విజయం తధ్యం.

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ మాట్లాడుతూ, బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తోమ్మిదేళ్లలో అంత్యోదయ ధ్యేయంగా పాలిస్తున్నాము. గుంటూరులో ఇళ్లు నిర్మించాము.
ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చాము. కరోనా సమయంలో ఉచితంగా మూడుడోసుల టీకాలు అందించాము. కరోన తరువాత కూడా నాలుగేళ్లపాటు ఉచితరేషన్ ఇచ్చిన మోదీ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. దేశంలోని ప్రతి ప్రాతం అభివృధ్ది చెందాలన్నదే మోదీ ధ్యేయం.

540 కోట్లు మన గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజి కి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదోవ పట్టించి, ప్రజలను మోసం చేసింది. పేద, బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రవేశపెట్టిన పధకాలను ముఖ్యమంత్రి జగన్ పక్కదోవ పట్టిస్తున్నారు. రానున్న ఎన్నికలలో తిరిగి బిజెపి ప్రభుత్వం వస్తుంది. అలగే మన రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వం వస్తే, రాష్ట్రాభివృధ్దికి ఉపయోగపడుతుంది.

వైసిపి మంత్రులు, శాసనసభ్యులు ఓటమి భయంతో పక్కచూపులు చూస్తున్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు మార్చే ముఖ్యమంత్రి మనకు వద్దని ప్రజలు ఛీ కోడుతున్నారు.
జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్మా‌ట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు అందిస్తుంటే, రాష్ట్రంలోని స్టిక్కర్ ప్రభుత్వం మాత్రం అభివృధ్దికి రాష్ట్రాన్ని దూరం చేస్తోందని విమర్శించారు. వైసిపి నవరత్నాల పేరుతో నయవంచన చేసి, మళ్లీ దోచుకోవటానికి సిధ్దమౌతున్నారన్న ఆయన, ఇసుక, మైనింగ్ వంటి పలు రంగాలలో నవరత్నాల పేరుతోదోపిడీ చేస్తున్నారని అన్నారు.

వల్లూరు జయప్రకాష్ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో* జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, చందు సాంబశివరావు, మకుటం శివ, భీమనేని చంద్రశేఖర్, మట్టాప్రసాద్, చిగురుపాటి కుమారస్వామి, షేక్ బాజీ, జూపూడి రంగరాజు, యడ్లపాటి రఘునాధబాబు, మిట్ట వంశీ, ఈదర శ్రీనివాసరెడ్డి , యడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ, కొక్కెర శ్రీనివాస్, లంక దినకర్,‌యామిని శర్మ,‌మాగంటి సుధాకర్ యాదవ్, పాలపాటి రవికుమార్, కుమార్ గౌడ్, వైవి సుబ్బారావు, పద్మనాభం, సుగుణ, నాగమల్లేశ్వరి, దారా అంబేద్కర్, దర్సనం శ్రీనివాస్, ఏడుకొండలు గౌడ్, కారంసెట్టి రమేష్, రాజేష్ నాయుడు, వెంకటేష్ యాదవ్, పెమ్మరాజు సుధాకర్, మాదాల సురేష్, రాచుమల్లు భాస్కర్, దేసు సత్యనారాయణ, తానుచింతల అనిల్, జితేంద్ర మరియు రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు

LEAVE A RESPONSE