వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల మాట ఒక నాటకం

– వికేంద్రీకరణ పాట ఒక బూటకం
-రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అంటారు.
-దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి.. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని మాత్రమే ఉంది..
– రాష్ట్ర సచివాలయం ఉన్న ప్రాంతాన్నే రాష్ట్ర రాజధాని గా గుర్తించారు
– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి

కడప : హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరు. కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అస్సాం తదితర 13 రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టు లు ఉన్నాయి. వాటిని రాజధానులు అనడం లేదు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉంది. కానీ కొచ్చిన్ ను కేరళ రాజధాని అనరు.. రాష్ట్ర సచివాలయం ఉన్న త్రివేండ్రం ను మాత్రమే కేరళ రాజధాని అంటారు.

అసెంబ్లీ భవనం ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరు. కర్ణాటకలో బెంగళూరు లో, బెల్గాం లో అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. అసెంబ్లీ భవనం ఉన్న బెల్గామ్ ను కర్ణాటక రాజధాని అనరు..రాష్ట్ర సచివాలయం ఉన్న బెంగళూరు ను మాత్రమే కర్ణాటక రాజధాని అంటారు.

కాబట్టి ఇప్పటికైనా పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అనే పడికట్టు పదాలను వైకాపా ప్రభుత్వం మానుకోవాలి. పరిపాలన రాజధాని (రాష్ట్ర సచివాలయం)ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు. అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని శాసన రాజధాని అనరు, అసెంబ్లీ అని మాత్రమే అంటారు. హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని న్యాయ రాజధాని అనరు, హై కోర్టు అని మాత్రమే అంటారు.

Leave a Reply