మహాపాదయాత్రలో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత

– ఇటు వంటి సీఎం ఉండడం దురదృష్టకరం
– అమరావతికి బీజేపీ మద్దతు
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ

విశాఖ: ఈ నెల 19 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రజా పోరు యాత్ర నడుపుతున్నాం.స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నడుపుతున్నాం.మా సిద్ధాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధి గాని, ఉత్తరాంధ్రను దోచుకోవడం కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ప్రాంతం లో ప్రశాంతం గా ఉండాలి కోరుకుంటున్నారు. మూడున్నరేళ్ల పాలనా ఏం అభివృద్ధి చేశారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలి. ఇటు వంటి సీఎం ఉండడం దురదృష్టకరం.

రాయల సీమ ప్రాంత జగన్ ఉత్తరాంధ్ర వరకు ఎలా పాదయాత్ర చేశారు? ఇప్పుడు అమరావతి యాత్ర ను అడ్డుకుంటామని మాట్లాడించడం దారుణం.అమరావతి యాత్ర కు ఏం జరిగినా దానికి సిఎం బాధ్యత వహించాలి. అమరావతి యాత్ర కి హైకోర్ట్ అనుమతి ఇచ్చింది. బిజెపి గా పూర్తి మద్దత్తు ఇస్తున్నాము పాదయత్రకి. మేము ఒకటే చెప్పాం ఈ రాష్ట్రానికి అమరావతే రాజధాని. కర్నూలులో హైకోర్ట్ ఉండాలని చెప్పాం.

పోలవరం విషయంలో ఈ రాష్ట్రానికి చేతకాక పోతే, తప్పుకుంటే, మేమే కడతాం. కొత్త లిక్కర్ వచ్చే వరకు పాత లిక్కర్ పాలసీ నడిపారు. కానీ అధికారం లోకి వచ్చాకా సాండ్ పాలసీ విషయంలో మాత్రం ఆరు నెలలు సమయం పట్టింది.ఈ ఆరు నెలలు కార్మికులు ఆకలి తో అలమడించారు.

రాష్ట్ర సంపదను ఏకికృతం చేసి దోచుకున్న వ్యక్తి ఈ ముఖ్య మంత్రి జగన్. అమరావతి రాజధాని పూర్తి చేస్తాను అని చెప్పావు మరి ఇప్పుడేం చేశారు? అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పూర్తి చేస్తాను అన్నారు ఏది పోలవరం పూర్తి చేసారా. ప్రజలు మోయలేని భారాన్ని ఈ ప్రభుత్వం వేస్తోంది. 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు, ఆర్టీసీ చార్జీ పెంచారు చివరకి చెత్త పన్ను వేశారు.ప్రభుత్వమే లిక్కర్ అమ్మడం వల్ల ఈ లిక్కర్ ధరలతో డ్రగ్స్ కు బానిస అవుతున్నారు.

కరోనా సమయంలో శానిటైజర్ తాగి చనిపోయారు.ఇప్పటికీ కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు. మళ్ళీ 2024 నరేంద్ర మోదీ పాలనా వస్తే గాని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు.అప్పుడే డబల్ ఇంజిన్ అభివృద్ధి సాధ్యం అవుతుంది.