Suryaa.co.in

Editorial

‘కమల వనం’లో చిందేసిన డాన్సు కోయిలలు!

బీజేపీ ఆఫీసులో చిందేసిన లీడర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పేరు భారతీయ జనతా పార్టీ అయినంత మాత్రాన, అందులో పనిచేసేవాళ్లంతా భారతీయతకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలనేం లేదు కదా? వారికీ కోరికలు, అవీ ఉంటయ్ కదా? సరే.. సంఘ్‌లో పనిచేసే వాళ్లంటే పెళ్లి చేసుకోకుండా, పార్టీ సేవలోనే అంకితమవుతుంటారు కాబట్టి వారిలా అందరూ ఉండలేరు. అఫ్‌కోర్స్.. వారిలో కూడా ఇప్పుడు కొందరు భౌతిక సుఖాల కోసం తపిస్తున్నారనుకోండి. అది తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నదే. దేశం కోసం కుటుంబ జీవితానికి దూరంగా ఉన్నందున, అలాంటి ‘త్యాగధనులకు’ ఆపాటి చిన్న చిన్న కోరికలుండటం సహజమేనట. అది వేరే కథ.

ఇప్పుడు బీజేపీ ఆణిముత్యాలు బెజవాడ పార్టీ ఆఫీసులో, నూతన సంవత్సరం సందర్భంగా వేసిన సినిమా డాన్సులు, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేదో సినిమాలో స్వామీజీ వేషం వేసిన

సత్యనారాయణ, రాత్రి వేళ్ల డాన్సర్లతో వేషం తీసి మందేసి చిందేసినట్లు… బయట భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి వాంతులు చేసుకునే ‘భారతీయ పార్టీ’ నేతలు ఇలా రెండవ రూపం ప్రదర్శించడమే విచిత్రం.ఇది కూడా చదవండి: ‘సారా’జుతో నవ్వుల పాలవుతున్న ‘పువ్వుపార్టీ’

బాలకృష్ణ అదేదో సినిమాలో ఒకవైపే చూడు. రెండోవైపు చూడకు అని హెచ్చరించినా, జనం సోషల్‌మీడియా పుణ్యాన ‘పువ్వుపార్టీ’ని రెండోవైపు చూడనే చూసేశారు.అయినా.. ‘మనది భారతీయ సంస్కృతి. మనకు కొత్త సంవత్సరంటే ఉగాది. ఇది ఇంగ్లీషోళ్ల పండగ’ అని సెలవిచ్చే ‘భారతీయ ఆధ్యాత్మిక జీవుల పారీ’్ట నేతలు, అదే ఇంగ్లీషోడి పండగ చేసుకోవడమే వింత.

ఏ మాటకామట. బీజేపీ ఆఫీసులో సినిమా పాటలకు అనుగుణంగా లయబద్ధంగా వేసిన డాన్సులు.. వారిలో ఉరికే ఉత్సాహం.. పక్కనే పొంగిన ప్రోత్సాహం చూస్తే, మొన్నీ మధ్య నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో వైసీపీ నేతలు వేసిన డాన్సుకు, బెడవాడ బీజేపీ నేతలు పోటీ పడ్డారా అనిపించింది. ‘ఎలాగూ సీట్ల విషయంలో వైసీపీతో పోటీపడలేం. కనీసం డాన్సులోనయినా పోటీపడలేమా’ అన్న భావనతో, బహుశా

బెజవాడ భాజపేయులు ఇలా రికార్డింగ్ డాన్సును సెట్ చేసినట్టున్నారు. కాకపోతే బుచ్చిరెడ్డిపాళెంలో వైసీపీ నేతల మాదిరిగా బయట నుంచి డాన్సరును తీసుకురాకుండా.. బయట ఎక్కడో మానసిక ఉల్లాస కేంద్రాల్లో కాకుండా.. ఎంచక్కా ఉన్న మహిళా నేతలు, పురుష నేతలు కలసి పార్టీ ఆఫీసులో నాలుగు గోడల మధ్య డాన్సులేయడం ఒక్కటే తేడా. మిగిలినదంతా షేమ్ టు షేమ్!

అయితే.. ఈ డాన్సు గోలపై సంఘ్ పెద్దలు సీరియస్ అయ్యారట. ఆ చిందులేంటీ? ఆ పాటలేంటీ అని చిరాకుపడ్డారట.ఇది కూడా చదవండి: వైసీపీ బావలూ… సయ్యా.. సయ్.. సయ్

LEAVE A RESPONSE