కొలికపూడి అభ్యర్ధిగా ఉంటే బీజేపీ పనిచేయదు

-కొలికపూడిని మార్చాల్సిందే
-పొత్తు ఉంటే తిరువూరు తీసుకుంటాం
-దళితుడై ఉండి దళిత, బీసీలను విమర్శిస్తారా?
-ఉద్యమం పేరుతో కొలికపూడి అవినీతి
-కొలికపూడి, స్వామిదాస్ ఇద్దరూ తోడుదొంగలే
-తిరువూరు బీజేపీ ఇన్చార్జి నంబూరు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

ఆర్య వైశ్య కులస్తుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు తగదు. దళితుడై ఉండి దళిత,బడుగు, బలహీన వర్గాల వారిని కించపరుస్తూ మాట్లాడటం , అధికారులకు కప్పలు వండి పెడతానని బహిరంగంగా హెచ్చరించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

సమాజం లో వ్యాపారులు, వినియోగదారులు, అధికారులు అందరిని గౌరవించుకోవాల్సిన అవసరం రాజకీయ నేతలైన ప్రతి ఒక్కరి పై వుంది. టిడిపి, జనసేన పొత్తు లో బీజేపీ ఉంటే, తిరువూరు నియోజకవర్గం లో కొలికపూడి ని మార్చాల్సిందే. లేకుంటే టిడిపి కి బీజేపీ సపోర్ట్ చేయదు. టిడిపి -జనసేన కూటమి పొత్తు లో బిజెపి ఉంటే తిరువూరు నియోజకవర్గం లో బిజెపి పోటీ చేస్తుంది.

జిల్లా బిజెపి నాయకులు గుత్తా శివ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అమరావతి జేఎసి చైర్మన్ గా ఉద్యమాలు నిర్వహించిన కొలికపూడి పెద్ద అవినీతి పరుడని, అమరావతి ప్రాంతం లో కాకుండా తిరువూరు లో టిడిపి టికెట్ ఇవ్వటం అందులో భాగమే నన్నారు. వైసీపీ, టిడిపి అభ్యర్థులు స్వామిదాస్, కొలికపూడి ఇద్దరూ తోడు దొంగలని ఒకరి గుట్టు మరొకరికి తెలుసునని విమర్శించారు.

అయోధ్య లోని రామరాజ్యం లాంటి ప్రశాంత మైన తిరువూరు లో , కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపు కోవటం కాకుండా, నియోజకవర్గ అభివృద్ధి ద్యేయంగా నంబూరి శ్రీనివాసరావు పనిచేస్తారని పేర్కొన్నారు.

Leave a Reply