Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వ అవినీతిని కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా బీజేపీ ఛార్జిషీట్

-రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అవినీతిని కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా బీజేపీ ఛార్జిషీట్ @ అభియోగ పత్రం ఉద్యమాన్ని చేపట్టింది 
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు

వైసీపి ప్రభుత్వ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడానికి ఛార్జిషీట్ ఉధ్యమాన్ని ఒక సాధనంగా తీసుకోవాలని బిజెపిరాష్ట్ర అధ్యక్షుడు ఉద్భోదించారు. బిజెపి ఛార్జిషీట్ కమిటీ, అభియోగాల నమోదు కమిటీల తో పాటు బిజెపి నాయకత్వ శ్రేణితో నేటి రాత్రి వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ మండల స్ధాయి అంశాలు సేకరణ, అసెంభ్లీ స్ధాయిలో తీసుకోవలసిన అంశాల పై కూలంకుషంగా వివరించారు. రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి భూమి సేకరణలో చేసిన అవినీతిని ఛార్జిషీట్ రూపంలో ప్రజల ముందు నిలబెడదాం అన్నారు. ఎకరం ఆరు లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి 18 లక్షలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయని ఈ విధంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో అవినీతి జరిగిందన్నారు.

మాజీ ఎమ్మెల్సీ, ఛార్జిషీట్ ఉద్యమ ముఖ్య బాధ్యుడు పీవీయన్ మాధవ్ మాట్లాడుతూ అసెంభ్లీ స్ధాయిలో 12 వతేదీ న నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వం జివో నెంబర్ 1 ని ఉపయోగిస్తే మనం స్వాగితిద్దాం అన్నారు. అవసరమైతే అరెస్టులకు సిద్ధంగా ఉండండి నేతలకు పిలుపునిచ్చారు. 7వ తేదీ నుండి11 వ తేదీ వరకు మండల స్ధాయిల్లో సేకరించిన అభియోగాలకు సంబందించి ఆధారాలను కూడా సేకరించాలన్నారు. అదేవిధంగా అసెంబ్లీ స్ధాయిలో 12 వతేదీన ఒక సమావేశం అసెంభ్లీ నియోజకవర్గ స్ధాయిలో నిర్వహించి అభియోగపత్రం దాఖలు చేయాలన్నారు.

అదేవిధంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుతో పాటు ముఖ్య నేతలు కూడా అనేక అభిప్రాయాలు పేర్కొన్న తరువాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముగింపు ప్రసంగంలో అన్ని అసెంభ్లీ నియోజక వర్గాల్లో నియోజకవర్గ కన్వీనర్లకు జిల్లా నాయకత్వం అండగా ఉండాలని సూచించారు. అసెంభ్లీ స్ధాయిలోనే వందల సంఖ్యలో అభియోగ పత్రాలు నమోదు చేయాలని, ప్రజల మధ్య ఉంటూ ప్రజల ఎదుర్కొంటున్న బాధలను వారి నుండి వినతి పత్రాలుగా స్వీకరిస్తూ వైసిపి ప్రభుత్వ అవినీతి అక్రమాలను వెలికి తీసి చార్జిషీటర్ రూపంలో ఫిర్యాదులు చేయాలని తద్వారా ప్రజలలో పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలని పార్టీ యంత్రాంగాన్ని సోము వీర్రాజు కోరారు.

ఏ ప్రాంతాల్లో అవసరమైన కూడా తాను రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఆయా ప్రాంతాల్లో పరిరక్షణ సిద్ధంగా ఉన్నామని ప్రజల్లో విశ్వాసంతో పాటు భరోసా కల్పించడమే ఈ యొక్క ఉద్యమ లక్ష్యంగా  వీర్రాజు వివరించారు

LEAVE A RESPONSE