– బీజేపీ అభ్యర్థిని కేసీఆర్ కి అప్పగించారు
– బీజేపీకి ఓటు వేసిన బీఆర్ఎస్ కి వేసినట్టే
– మంత్రి పొన్నం ప్రభాకర్
– జూబ్లీహిల్స్ మహమూద్ ఫంక్షన్ హాల్ లో యూసుఫ్ గూడా డివిజన్ మైనార్టీ నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్,ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్ సమావేశం
– సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి సెక్రెటరీ విశ్వనాథ్ , సంపత్ కుమార్, ఎంపీ కడియం కావ్య , ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, శివసేన రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి , నూతి శ్రీకాంత్ గౌడ్ వెలిచాల రాజేందర్ రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. బీజేపీ , బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో కుమ్మక్కై పని చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అప్లై చేసుకున్న అర్హతగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం.
గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినే పరిస్థితి లేకుండే. మేము సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. పేదలు కరెంట్ బిల్లు కట్టాలన్న ఇబ్బందులు పడేది. మా ప్రభుత్వంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మైనార్టీల కోసం మన ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించింది. ఉపాధి కల్పనకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. ఇటీవలే మన అజారుద్దీన్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థిని కేసీఆర్ కి అప్పగించారు. బీజేపీకి ఓటు వేసిన బీఆర్ఎస్ కీ వేసినట్టే. బీఆర్ఎస్ కు ఓటేసిన బీజేపీ కి వేసినట్టే. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి అంతకన్నా తక్కువే వస్తాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు విద్యావంతుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీ తో గెలిపించండి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అక్కడ ఆరు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు నవీన్ యాదవ్ ను గెలిపించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆయన వెంట ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ పనులు,ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేశాం.