Home » ఢిల్లీలో టోరంటో విమానానికి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో టోరంటో విమానానికి బాంబు బెదిరింపులు

తాజాగా ఢిల్లీ నుంచి టోరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఎయిర్‌ కెనడాకు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టరంటోకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఈమెయిల్‌ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా బెదిరింపు బూటకమని తేలింది.

Leave a Reply