Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపట్ల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపం

-టీడీపీ పోలవరం పనులు 70శాతం చేస్తే, జగన్ హయాంలో పోలవరం పడకేసింది
-తాడేపల్లి ప్యాలెస్ లోని ఏసి గదుల్లో సీఎం, మంత్రులు-వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు
-పోలవరం నిర్వాసితులకు అందజేశామంటున్న రూ.500 కోట్లు ఎవరి ఖజానాలోకి?
-మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

రాష్ట్రానికి తాగు, సాగు నీటికి ప్రధానమైన పోలవరం బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం పడకేసిందని, ఎన్నో పోరాటాలు తర్వాత ఈ ప్రాజెక్టుని సాధించుకున్నా వైసీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకుందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కా ప్రణాళికతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు రివ్యూ చేసి 70 శాతం పనులను పూర్తి చేశారు. అహర్నిసలు కష్టపడి 11వేల కోట్లు ఖర్చు పెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుని తెలుగుదేశం ప్రభుత్వం చిత్త శుద్ధితో 70 శాతం పనులు పూర్తి చేసింది. మిగతా పనులు అంకుటిత దీక్షతో పూర్తి చేయాలని అనుకుంటే జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుని నిర్విర్యం చేసింది. ఇది టీడీపీ నాయకులుగా మేము అంటున్న మాట కాదు, గతంలో పార్లమెంటే స్పష్టం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని పనులు జరిగాయని 05-03-2020 పార్లమెంటు సాక్షిగా కేంద్ర జల వనరుల శాఖ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 70 శాతం పనులని పూర్తి చేశారని, 11వేల కోట్లు ఖర్చు పెట్టారని స్పష్టమైన ప్రకటన చేసింది.

కేంద్రం రియంబర్స్ చేసిన, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కాని, కేంద్ర జల వనరుల శాఖ, అక్కడున్న నిపుణుల సూచనలు, వాళ్లకి ఇచ్చిన డిజైన్స్ ప్రకారం పోలవరం నాణ్యతతో పక్కాగా 70శాతం పనులు పూర్తి అయ్యాయని గతంలో భారత పార్లమెంటులో నేడు ఉన్న యన్.డి.ఎ ప్రభుత్వం ప్రకటించింది.

అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తానని పాదయాత్రలో చెప్పాడు. అధికారంలోకి వచ్చాక 2020 కాస్త 2022దాకా పొడిగించుకుంటు వచ్చాడు. నిన్న పార్లమెంటు సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటు రాజ్యసభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విశ్వేశ్వరతుడు ఇచ్చిన సమాధానం.

జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఒక ప్రణాళిక లేదు. జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల 2024 నాటికి కూడ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందో లేదో కూడ తెలియదు అని పార్లమెంటులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విశ్వేశ్వర్ ఇచ్చిన ప్రకటన గురించి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు?

పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియని అంబటి రాంబాబు, మంత్రులు, ప్రతి ఒక్కరు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా పూర్తి చేయాలో ముఖ్యమంత్రికే అవగాహన లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టిన నిధులు 4వేల కోట్లు ఉంటే, 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తరువాత కేంద్రం పీపీఎ రియింబర్స్ చేస్తే ఆ డబ్బులని కూడ ప్రాజెక్టుకి వాడకుండా దారి మళ్లించారు. నేడు పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా నాసిరకం పనులు జరుగుతున్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో దాదాపు 21వేల కోట్లు వృధా చేశారని రిపోర్టులు వచ్చాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అందరూ జగన్ మోహన్ రెడ్డి అసమర్థతను ఎత్తి చూపుతున్నారు. జగన్ రెడ్డి, అతని మంత్రులు మాత్రం బుకాయిస్తున్నారు.

తెలుగుదేశంప్రభుత్వ హయాంలో 70 శాతం పనులు పూర్తి అయ్యాయని పార్లమెంటులో చేసిన ప్రకటన రికార్డులలో ఉంది. ఇదేమి రాజకీయ ఆరోపణ కాదు. జగన్ రెడ్డి హయాంలో గడచిన మూడు సంవత్సరాలలో కనీసం 7 శాతం పనులు కూడ పూర్తి చేయలేదని, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిగ్గుతో దలదించుకోవాల్సింది పోయి వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు బరితెగించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని, మీరు చేస్తున్న దుశ్చచర్యలని గమనిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో నాసిరకం పనులు, ఖర్చు పెట్టింది నామ మాత్రపు నిధులు, నిర్మాణంలో కూడ ఎక్కడ ప్రణాళిక లేకుండా చేసిన పనులు, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు వచ్చిన డబ్బులను కూడ దారి మళ్ళించారు.

పోలవరం నిర్వాసితులకు గతంలో జగన్ అనేక సార్లు, అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం మీకు కాంపర్ జేషన్ ఇవ్వడం లేదని మీకు అండగా ఉంటాను, ఆదుకుంటానని, మీకు ఎకరానికి ఇంత ఇస్తా అంతా ఇస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలని మభ్య పెట్టాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏఒక్క హామిని కూడ నెరవేర్చలేదు. నిర్వాసితులకు ఎకరానికి 19లక్షల రూపాయలు, మరల ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని పాదయాత్రలో హామి ఇచ్చాడు. నేను మాట తప్పను మడమ తిప్పను నేను వై.యస్. రాజశేఖర్ రెడ్డి తనయుడునని అనేక గొప్పలు చెప్పాడు.

నిర్వాసితులని గాలికి వదిలేసి వాళ్ళిని మోసం చేసి, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అన్ని పనులని వదిలేసి నేడు పోలవరం నిర్మాణాన్నే అగమ్య గోచరంగా మార్చాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా పోలవరం ప్రాజెక్టు తూతూ మంత్రపు పనులతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అగమ్యగోచరం. నిర్వాసితులకి 500కోట్ల రూపాయలు ఇచ్చాం అన్నారు, అవి ఎవరి ఖజానలోకి చేరాయో తేలీదు.

నేడు వరదలు వస్తే బాధితులకి కనీస అవసరాలు అయిన పాలు,నీళ్ళు, బియ్యం, భోజనం వంటి వాటిని అందిచాల్సిన బాధ్యతని జగన్ విస్మరించాడు. నేడు లక్షలాదిమంది అన్నమో రామ చంద్రా అంటూ పసిపిల్లలతో సహా అలమటిస్తున్నారు. జగన్ రెడ్డి ఏదో కంటి తుడుపుగా నాలుగు కూరగాయలు ఇచ్చి వాళ్ళని తానే ఆదుకుంటున్నట్టు ప్రకటించుకోవడం దుర్మార్గం. నిర్వాసితులు, ముంపు గ్రామాల బాధలు మీద ముఖ్యమంత్రికి అవగాహన, చిత్తశుద్ధి లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఏసి గదులలో జగన్ రెడ్డి, వైసీపీ మంత్రులు ఉండి అన్ని బాగా జరుగుతుందని చెప్పడం బాధాకరం. టివి, ప్రసార మధ్యమాలలో చూస్తే జనాలు ఆకలితో అలమటిస్తూ ఆకలి కేకలు పెడుతున్నారు. పసిపిల్లలతో పడవలు మీద పడుకుంటున్నారు. నిద్రలేని రాత్రులు, ప్రాణాలు ఉంటాయా, పోతాయో అని ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయడు గారి హయాంలో భారతదేశంలోనే బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుకి 2018లో అవార్డు వచ్చింది. నేడు జగన్ హయాంలో వరస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా, ప్రణాళిక లేని, నాసిరకం పనులు, ఆదాయ వనరుగా పోలవరం ప్రాజెక్టు క్రాంటక్టులు, పార్లమెంటులో ప్రకటన వచ్చిందంటే నేడు జగన్ రెడ్డి పోలవరం పై చేస్తున్న పనులు మీద దేశ వ్యాప్తంగా రాష్ట్ర పరువు పోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే అగమ్యగోచరంలో ఉందనడానికి నిదర్శనం 18-07-2022న జల వనరుల శాఖ ఇచ్చిన ప్రకటన. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకి కావాల్సిన 73.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని కావాల్సుంటే 38లక్షల 12వేల క్యూబిక్ మీటర్ల పని చేశాం. మిగిలిన 35.82 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉండగా నేటికి జగన్ ముఖ్యమంత్రి అయి మూడున్నర సంవత్సరాలు గడిచిన పోలవరం ప్రాజెక్టు పనులని ముందకు నడిపించలేకపోయారు.

పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ ప్రాజెక్టు గురించి జగన్ మా చేతులో ఉన్నాడని వాళ్ళు పోలవరం ఎత్తు తగ్గించమంటే తగ్గిస్తాడని, ఏం చేయమంటే అది చేస్తాడని మాట్లాడుతున్నారు. మరల మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ మాటలు అన్న ముఖ్యమంత్రి కలిసి భద్రాచలం ముంపు గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్లని ఇస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు ఎంత జరగాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. వైసీపీ ప్రభుత్వ వచ్చిన మూడు సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నిర్వాసితులకి ఇచ్చారు, ఎంత శాతం ప్రాజెక్టు పనులు పూర్తి అయినవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు తెలియచేయాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE