సెల్ఫీ దిగుతూ కుర్రాడు మృతి

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్సు రైలు బండిపై ఎక్కి సెల్ఫీ దిగుతూ, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ యువకుడు కటకం వీరభద్రుడు రాత్రి మృతి చెందినట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్నట్లు వారు తెలిపారు మృతుడు వీరభద్రుడు స్వగ్రామం మాచవరం మండలం వేమవరం.

Leave a Reply