Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గతకొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.దీంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

LEAVE A RESPONSE