తన నియోజకవర్గంలో కమ్మ ప్రాధాన్యం తగ్గిస్తానంటూ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు.. పౌరుషం ఉన్న ఏ కమ్మవారినయినా కదిలించేవే. ఇదే మాట మరో సామాజిక వర్గం మీద అనుంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు.
కమ్మరావతి అన్నా.. కమ్మరోనా అన్నా..కిక్కురుమనలేదు కమ్మవారు. ఎన్టీఆర్ ని అయినా, చంద్రబాబును అయినా గుండెల్లో పెట్టుకుని అభిమానించారు. తేడాలొస్తే నిర్మొహమాటంగా నేలకేసి కొట్టినంత పని చేశారు.
తమ వ్యతిరేకతను పైకి ఏమాత్రం కనపడనివ్వరు. టైం వచ్చినప్పుడు చేతల్లో మాత్రమే చూపిస్తారు. వీళ్ళ ప్రోగ్రెసివ్ మెంటాలిటినే… వీళ్లకు శాపంలా మారింది.. అందరి అసూయకు కారణమైంది. అధిక శాతం మంది బీసీ సోదరులు కమ్మలను అభిమానించినంతగా… మిగతా సామాజికవర్గాల వారు అభిమానించరు ఇది వాస్తవం.
ఇలాంటి చర్యల ద్వారా… బీసీల్లో కుడా వ్యతిరేకత కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని భావించాలి. 2024 ఎలక్షన్స్ లో పోలరైజ్ అయిన కమ్మ ఓట్లు… ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చరిత్రలోనే ఎప్పుడూ అయ్యుండవు.
అయినా… ఒకపక్క కమ్మ అధికారుల్ని, మరోపక్క కమ్మ నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతున్నారు బాబుగారు! బాబు గారు ఇంకా మొహమాట పడుతున్నారని భావిస్తే… బహిష్కరించడం ఒక్కటే మిగిలింది రాష్ట్రం నుంచి !!
– కంకణాల శ్రీనివాస్