– తొలి లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించింది నెహ్రు
– పశ్చిమ బెంగాల్ నుంచి అంబేద్కర్‌ను రాజ్యసభకు పంపించిన జనసంఘ్
– మరి అంబేద్కర్ ఎవరి మనిషి?
– అంబేద్కర్‌ను ఓడించిన కాంగ్రెస్ మనిషా? ఎంపీని చేసిన జనసంఘ్ మనిషా?
– నాటి జనసంఘ్.. నేటి బీజేపీకి మరి అంబేద్కర్‌పైద్వేషం ఎందుకు ఉంటుంది?
– ఈ చరిత్ర ఎందరికి తెలుసు?
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. నిజానికి అంబేద్కర్‌ను అసలు పార్లమెంటులో అడుగుపెట్టకుండా అడ్డుకుని ఓడించింది ఎవరు? ఆయనను పట్టుదలతో అదే పార్లమెంటులోకి తీసుకువచ్చింది ఎవరు? నెహ్రుకు అంబేద్కర్‌పై కోపం ఎందుకు? అదే అంబేద్కర్‌ను ఇప్పటి బీజేపీ-అప్పటి జనసంఘ్ పట్టుపట్టి రాజ్యసభకు ఎందుకు పంపించింది? అన్న వాస్తవాలు, గత చరిత్ర తెలుసుకుంటే.. దేశంలో కోట్లాదిమంది అమాయక దళితులు, కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడరు! సరికదా.. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ను ఛీ కొడతారు. తమను దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చిన తమ నేతలను.. ‘‘మాకు చరిత్ర చెప్పకుండా మమ్మల్ని ఎందుకు మోసం చేశార’’ని నిలదీస్తారు.
బిజెపి జనతాపార్టీలో కలవకముందు జనసంఘ్‌గాఉండేది. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. శ్యామాప్రసాద్,డాక్టర్ అంబేద్కర్లు నెహ్రూ మంత్రివర్గంలో సహచరులు. వీరిద్దరూ మంచి మిత్రులు.
ఇద్దరూ నెహ్రూవిధానాలతో విభేదించారు. ఇద్దరూ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. కశ్మీర్ మీద నెహ్రూనిర్ణయాలను శ్యామా ప్రసాద్ తో పాటు అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు.
శ్యామాప్రసాద్,అంబేద్కర్ ఇద్దరూ విద్యాధికులు,మేధావులు.వారు ఈదేశానికి కాంగ్రెస్ పాలన మేలుచేయదని ప్రకటించారు ప్రథమ లోక్ సభ ఎలక్షన్స్ లో నెహ్రూ తన పనిమనిషినిపెట్టి..అంబేద్కర్ గారిని ఓడించిన తర్వాత. . జనసంఘ్ పార్టీ అంబేద్కర్ గారిని పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు పంపినది. ఆనాటి అంబేద్కర్ ఆశయాలను జనసంఘ్ నేత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ “అంత్యోదయ”అనేసిద్ధాంతంగా మలచారు.మోదీజీ ఇప్పుడు ఆవిధానాన్నే అమలుచేస్తున్నారు
ఒక ప్రభుత్వపథకం ఏదైనాఉంటే అదిఢిల్లీలో ఉన్నవాడికీ,అండమాన్స్ అడవుల్లో ఉన్నవాడికీ ఒకేరోజు అందాలనేది సూక్ష్మంగా అంత్యోదయలో ఒకనిర్ణయం. అంబేద్కర్‌కి బిజెపికి సంబంధంఏమిటని వ్యాఖ్యానించే వాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటం మనదౌర్భాగ్యం.
మరి ఇన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత కూడా.. బీజేపీ అంబేద్కర్ వ్యతిరేకి ఎలా అవుతుందన్న ప్రశ్న, మెడపై తల ఉన్న ఎవరికయినా వచ్చి తీరుతుంది. అంటే.. చరిత్ర చెప్పడంలో బీజేపీ విఫలయిందా? ఆ కారణంతోనే అంబేద్కర్ ఆరాధకులైన దళితులు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మారారా? మరి బీజేపీ అనుబంధ దళితమోర్చా ఏం చేస్తున్నట్లు? .. ఇలాంటి సందేహాలు తెరపైకి రావడం సహజం.
– జానకీదేవి, తణుకు