Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది

– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులకు విడుదల చేసిన వీడియో వివరాలు ఆయన మాటల్లో.. రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులను పోలీసులు హరిస్తు్న్నారు. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వెలుగులోకి తేవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే దాన్ని పోలీసు వ్యవస్థ అడ్డుకుంటోంది.

ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి. విశాఖలో భూ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోంది. రుషికొండలో పర్యావరణానికి భంగం కలిగేలా తవ్వకాలు జరుగుతున్నాయి. వైసీపీ నాయకులు దోపిడీదొంగల్లా తయారయ్యారు. టీడీపీ నాయకులు వీటన్నింటిని వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తుంటే బయటికి రాకుండా నియంత్రిస్తు్న్నారు. హైకోర్టు చెప్పినప్పటికి బేఖాతరు చేస్తున్నారు.

తెలుగుదేశం నాయకులను అక్కడికి వెళ్లకుండా చేస్తున్నారు. దస్ పల్లా భూములను కబ్జా చేశారు. విశాఖ భూములు కబ్జా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ధర్మాన ప్రసాద్ అసైన్డ్ ల్యాండ్ భూములను దోపిడీ చేస్తున్నారు. వీటన్నింటిని వెలుగులోకి రాకుండా చేయడానికి ప్రజాపక్షాన వాస్తవాలను బయటికి తేవడానికి తెలుగుదేశం నాయకులు వెళ్తుంటే రెండు రోజుల నుంచి వారిని గృహ నిర్బంధాలు చేయడం అక్రమం, అన్యాయం.

LEAVE A RESPONSE