Home » రమ్య ఘటనలో ఈ ప్రభుత్వం ఏంన్యాయం చేసిందో డీజీపీ చెప్పగలరా?

రమ్య ఘటనలో ఈ ప్రభుత్వం ఏంన్యాయం చేసిందో డీజీపీ చెప్పగలరా?

• డీజీపీ చేయాల్సింది టీడీపీవారికి చట్టాలపై అవగాహనకల్పించడంకాదు. పోలీసులను దూషిస్తున్న వైసీపీవారి నోళ్లకు తాళాలేయడం.
• డీజీపీ మాటలు వింటుంటే, ఆయనతోపాటు ఐపీఎస్ లందరికీ మరలాప్రాథమికస్థాయి నుంచి శిక్షణఇవ్వాలేమోననిపిస్తోంది.
• పోలీస్ శాఖను అధికారపార్టీనేతలు, మంత్రులు అవహేళన చేస్తుంటే, డీజీపీ ఏనాడూ వాటిని ఖండించలేదు.
• వైసీపీ పుట్టిందే ఓదార్పు యాత్రలోనుంచనే వాస్తవాన్ని ఆపార్టీ వారెందుకు తెలుసుకోరు?
• జగన్మోహన్ రెడ్డి ఏళ్లతరబడి పాదయాత్ర, ఓదార్పుయాత్ర నిర్వహిస్తే, ఏనాడైనా టీడీపీప్రభుత్వం అడ్డుకుందా?
• లోకేశ్ స్వేచ్ఛగా నరసరావుపేటకు వెళ్లి, యువతికుటుంబాన్ని పరామర్శించడానికి డీజీపీ, పోలీస్ శాఖ అనుమతించాలి.
* టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీదా రవిచంద్ర
రాష్ట్రంలో అమల్లోలేని దిశాచట్టాన్ని అడ్డుపెట్టుకొని, ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, వైసీపీనేతలు, కార్యకర్తలంతా మహిళల మాన, ప్రాణాలను గురించి, వారికి, వారికుటుంబాలకు అండగా నిలుస్తున్న టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్ గురించి అవహేళనగా మాట్లాడటం, ఆడబిడ్డలకు అండగానిలిచి, వారికిధైర్యాన్నివ్వాల్సిన పోలీస్ శాఖ, వారికి వత్తాసుపలకడం సిగ్గుచేటని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మండిపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే ….
జగన్ జమానాలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను నిరసిస్తూ, నారాలోకేశ్ చేపడుతున్నచర్యలపై ఈ ప్రభుత్వానికి ఎందుకంత ఉలుకు? మహిళలపై దురాగతాలు జరిగిన ప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నశైలిని నిలదీయకూడదా? వారిచర్యలను అఘాయిత్యాలకు బలైన వారికుటుంబాల తరుపున ప్రశ్నించకూడదా? దిశాచట్టం కింద ముగ్గురికి ఉరిశిక్షలు, 20 మందికి యావజ్జీవశిక్షలు వేశామని హోంమంత్రి చెప్పడం హాస్యాస్పదం. డీజీపీనేమో దిశాచట్టం ఫైలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్యనే తిరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులేమో దిశాచట్టంకింద 21 రోజుల్లో నిందితులకు శిక్షలంటూ డబ్బాలుకొడుతున్నారు. ఆడబిడ్డలు బయటకువెళితే, వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పడుతున్న మానసికవేదనకు ఈ ప్రభుత్వం సమాధానంచెప్పదా?
రాష్ట్రంలో అడ్డూ, ఆపులేకుండా వరుసగా మహిళలపై జరుగుతున్నదారుణాలకు సంబంధించి, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు డీజీపీకి, ముఖ్యమంత్రికిలేఖరాశారు. అయినా వారినుంచి నామమాత్రపు స్పందనకూడా లేదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనలకు పరిమితమయ్యారుతప్ప, రాష్ట్రంలో కామాంధుల దురాగతాలు, అఘాయిత్యాలకు బలవుతున్న ఆడబిడ్డలకు న్యాయం జరగడంలేదు. గడచిన సంవత్సరంలో ముఖ్యమంత్రి నివాసానికి, డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఘటనలుజరిగాయి. ఆయాఘటనల్లో ఎవరిని శిక్షించారు? ఈ విధంగా ఎక్కడుందో, ఏంన్యాయం చేస్తుందో తెలియని దిశాచట్టాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులు, మంత్రులు, అధికారపార్టీనేతలు ఎంతకాలం మహిళల మాన,ప్రాణాలతో ఆడుకుంటారు? ముఖ్యమంత్రి ఇంటిసమీపంలో జరిగిన అత్యాచార ఘటనలో దిశాచట్టం అమలైందా?
ఆ ఘటనలో ప్రభుత్వం నిందితులను శిక్షించిందా? వైసీపీపాలనలో పేట్రేగిపోతున్న మృగాళ్లు, కామాంధుల దురాగతాలకు బలైనబాధితురాళ్ల కుటుంబాల పరామర్శకు నారాలోకేశ్ వెళితే ప్రభుత్వపెద్దలు, పోలీసులు హైరానాపడుతూ, అయినదానికీ కానిదానికీ ఎందుకింతలా గంతు లేస్తున్నారు? గతంలో ఆయన హజీరా కుటుంబాన్ని పరామర్శించడానికి కర్నూలుకు వెళ్లాలనుకుంటే అడ్డుకు న్నారు. ఇప్పుడేమో నరసరావుపేట వెళుతుంటే వద్దంటున్నారు. నరసరావుపేటలో అనూషఅనే యువతిని దారుణంగా చంపేసినవ్యక్తి దర్జాగా బయటతిరుగుతుంటే ఈప్రభుత్వానికి కనిపించడంలేదా?
రాష్ట్రంలో ప్రతిపక్షనేతలు ఎక్కడికీవెళ్లకూడదా? లోకేశ్ వస్తున్నాడని తెలిసీ విమానాశ్రయంలోపలా, బయటా వేలమంది పోలీసులు ఉండాల్సిన అవసరమేంటి? సాధారణ ప్రయాణీకులను కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేశ్ వెళితే, దానిలోని తప్పేంటో చెప్పాలి. ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నించకూడదా? రమ్య హత్యోదంతంలో ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో, ఎవరికి న్యాయంచేసిందో డీజీపీ చెప్పాలి. డీజీపీ వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయనతోసహా, ఐపీఎస్ లందరికీ పోలీస్ అనేపదానికి అర్థంచెబుతూ మరలా ప్రాథమికస్థాయి, నుంచి శిక్షణ ఇవ్వాలేమోననిపిస్తోంది.
డీజీపీ సవాంగ్ గతంలో తెలుగుదేశంప్రభుత్వంలో విజయవాడ కమిషనర్ గాపనిచేశారు. అప్పుడు ఏనాడైనాఆయన ఇలా ప్రవర్తించారా? ఎవరైనా విధినిర్వహణ చేయొద్దని ఆనాడు ఆయనతో చెప్పారా? పోలీస్ శాఖను అధికారపార్టీనేతలు, మంత్రులు అవహేళన చేస్తుంటే, డీజీపీ ఏనాడూ వాటిని ఖండించలేదు. ఆఖరికి అధికారపార్టీ కార్యకర్తలుకూడా ఖాకీలను ఖాతరుచేయడంలేదు. ఆఖరికి ఎస్పీస్థాయి అధికారులు కూడా దూషణలకు గురవుతుంటే, ఏనాడైనా డీజీపీ వారికి అండగా నిలిచారా? కనీసం ఒక్క ప్రకటన అయినా చేశారా. అలాంటి డీజీపీ సిగ్గులేకుండా టీడీపీ వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తామనడం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఏంజరుగుతుందో తెలిసికూడా డీజీపీ నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నారు. టీడీపీవారు ఏదైనా కార్యక్రమం చేపడితే మాత్రం పోలోమంటూ వచ్చేసిఅడ్డుకుంటారు. ఇదేమీ పోలీసింగో అర్థంకావడంలేదు.
నిన్నటికి నిన్న గుంటూరుజిల్లాలోని మేడికొండూరులో పొలాల్లో మహిళపై అత్యాచారయత్నం జరిగితే పోలీసులుఏం చేస్తున్నారు. డీజీపీ చేయాల్సింది, టీడీపీవారికి చట్టాలపై అవగాహన కల్పించడంకాదు, ఆడబిడ్డలకు రక్షణకల్పించి, వైసీపీవారినోళ్లకు తాళాలువేయించి, వారికి చట్టాల పవరేంటో చూపించాలి. ఆపని చేతకాకుంటే, ఉద్యోగానికి రాజీనామా చేయండి. వైసీపీ పుట్టిందే ఓదార్పు యాత్రలోనుంచనే వాస్తవాన్ని ఆ పార్టీ వారెందుకు తెలుసుకోరు? జగన్మోహన్ రెడ్డి ఏళ్లతరబడి పాదయాత్ర, ఓదార్పుయాత్ర నిర్వహిస్తే, ఏనాడైనా టీడీపీప్రభుత్వం అడ్డుకుందా? రెండ్రోజులక్రితం రమ్య కుటుంబానికిన్యాయం చేయాలని కోరుతూ, టీడీపీ మహిళా విభాగంవారు కొవ్వొత్తులర్యాలీ చేపడితే ఎందుకు అడ్డుకున్నారు?
మహిళలనికూడా చూడకుండా, వారిని రౌడీషీటర్లలా ట్రీట్ చేయడమేంటి? పోలీసులు వారిపై ఎందుకంత కాఠిన్యంగా ప్రవర్తించారో డీజీపీ చెప్పాలి. రాష్ట్రంలో ప్రజలకు, మరీముఖ్యంగా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్షంగా టీడీపీ స్పందిస్తుంది. టీడీపీనేతలు, బాధితురాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారు. వైసీపీవారు గతంలో ప్రతిదాన్నీ రాజకీయాలకు వాడుకున్నారు. ఆనాడు ఎప్పుడైనా వారిని టీడీపీప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారా? అందుకు పోలీసులకే, మరోసారి ఐపీఎస్ చట్టాలపై అవగాహనకల్పించాలని తాము అంటున్నాం. నేడు లోకేశ్ స్వేచ్ఛగా నరసరావు పేటవెళ్లి, అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి డీజీపీ, పోలీసులు అనుమతించాలి. గోటితో పోయేవిషయాలను, పెద్దవి చేయొ ద్దని పోలీసువారిని కోరుతున్నాం.

Leave a Reply