Suryaa.co.in

Andhra Pradesh

30 కి.మీ కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా?

– ప్రజలు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు
– సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి ఫైర్

చిత్తూరు : కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తెస్తున్నట్లు సిఎం బూటకపు మాటలు చెబుతున్నారు. టిడిపి పాలనలో 630 కి.మీ కాలువలు తవ్వి నీళ్ళు తీసుకొచ్చాం. ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో 30 కి.మీ కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా? పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి కుప్పంకు నీరు తేవడం సాధ్యమేనా?

ఎన్నికల నోటిఫికేషన్ ముందు జిమ్మిక్కులు చేస్తున్నారు. జగన్మోసాల రెడ్డి ఫార్స్ బుకాయింపులను జనం నమ్మరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఊదరగొట్టారు, ఇపుడు ఆ ఊసే లేదు. కుప్పంకు ఏదో చేస్తున్నట్లు పేపర్ ప్రకటనలు మినహా చేసిందేమీ లేదు. పులివెందుల రైతులకు చంద్రబాబు సీఎంగా ఉండగా నీటిని అందించి పంటలను కాపాడింది నిజమా ! కాదా?

ఇరిగేషన్ శాఖ మీద ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన లేదు. అవగాహన లోపంతో అవాస్తవాలను జనం మీద రుద్దు తున్నారు. రివర్స్ గేర్ లో సిఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపారు, ప్రజలు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు.

LEAVE A RESPONSE