నిర్మాత జాఫర్ సాదిక్‌ పై ఈడీ డ్రగ్స్ కేసు

తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాదిక్‌పై రూ. 40 కోట్లకు పైగా సంపాదించారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఆ మొత్తాన్ని రియల్‌ ఎస్టేట్‌, సినిమా ప్రొడక్షన్‌కు మళ్లించారని పేర్కొంది. రూ. 12 కోట్లు మూవీ ప్రొడక్షన్‌లో, రూ. 21 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని పేర్కొంది. గత నెలలో సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపు లోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Read More

ఇక డాక్టర్ రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కు నేడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని వేల్స్ యూనివర్సిటీ…

Read More

ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు కన్నుమూత

చిత్ర పరిశ్రమంలో విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషాల్లో విశ్వేశ్వర రావు అనేక సినిమాల్లో నటించారు. తన నటనతో అందరిని నవ్వించారు. విశ్వేశ్వర రావు మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించినట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. విశ్వేశ్వర రావు మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ఆయన కెరీర్‌లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. బాలనటుడిగానే…

Read More

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ నుంచి భలే వెడ్డింగ్ పాట విడుదల

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. తాజాగా డియర్ నుంచి భలే వెడ్డింగ్ పాటని…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాం చరణ్ దంపతులు

తిరుపతి: సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండ పంలో రాంచరణ్ దంప తులకు పండితులు వేదా శీర్వచనం చేయగా, అధికా రులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Read More

సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం‌

-శంషాబాద్ వద్ద మంగ్లీ కారును డీకొట్టిన డిసియం వ్యాన్ -చేగురు కహ్నా శాంతివనంకు వెళ్ళి తిరిగి వస్తున్న సింగర్ మంగ్లీ గాయని మంగ్లీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తొండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుండి వస్తున్న డిసియం వ్యాన్ కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు డ్రైవర్ రాజు, మనోహర్ ఉన్నారు.రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ…

Read More

విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని మార్చి 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ శుభకార్యానికి రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. హయవాహినికి గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.

Read More

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

విశాఖ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుని ఇంట్లోకి ప్రవేశించి పక్కా ప్లాన్తో ఆమె ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు మూవీల్లో సౌమ్య నటించింది.  

Read More

దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్ ?

డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులు టెస్ట్ చేయించారు. యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు.

Read More

సీసీఎల్‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం

* బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెల‌బ్రెటీలు ఆడ‌నున్నారు * ఉచితంగా 10 వేల మంది కాలేజీ విద్యార్థుల‌కు ఎంట్రీ * హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు హైద‌రాబాద్‌: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌)కు ఆతిథ్య‌మిచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబువుతుంద‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. ఈ లీగ్ తొలి అంచె మ్యాచ్‌లు షార్జాలో జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి 3 తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న రెండో అంచె…

Read More