ఆర్థిక సంక్షోభంలో పాక్.. అద్దెకు కరాచీ పోర్టు

పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. IMF నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందకపోవడంతో.. ఇప్పటికే పాక్ ప్రభుత్వం విదేశాల్లో చరాస్తులను అమ్మడం, అద్దెకివ్వడం చేస్తోంది. తాజాగా పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ప్రధాన ఓడరేవును UAEకి చెందిన ఏడీ పోర్ట్ గ్రూప్నకు అద్దెకు ఇచ్చింది. 50 ఏళ్ల పాటు కరాచీ పోర్టు నిర్వహణ బాధ్యతలను AD పోర్టు చూసుకుంటుంది. ఈ ఒప్పందం విలువ 220 మిలియన్ డాలర్లు.

Read More

హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రించిన పాకిస్థానీ న‌టుడు షయాన్ అలీ

పాకిస్థాన్ నటుడు, సోషల్ మీడియాలో ప్ర‌భావ‌శీలి అయిన షయాన్ అలీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూ ధర్మాన్ని స్వీకరించినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తనను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఈ స‌మ‌యంలో శ్రీకృష్ణుడు త‌న‌కు దారి చూపాడాని, త్వరలో భారత్‌కు రావాలని యోచిస్తున్నట్లు షయన్‌ పేర్కొన్నాడు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్టర్‌లో ద్వారా ఘర్ వాప‌సీని ప్రకటించాడు. గత 2 సంవత్సరాలుగా త‌న‌పూర్వీకుల సంస్కృతి, జీవనశైలిని గమనించిన తర్వాత, హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రిస్తున్న‌ట్టు…

Read More

మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న

– జో బైడెన్ దంప‌తుల‌కు భార‌తీయ‌ సాంప్ర‌దాయ బ‌హుమ‌తులు ‘ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషత్తుల’ పుస్త‌కం బ‌హుక‌ర‌ణ ద‌శ‌ దానాల ప్ర‌కారం బ‌హుమ‌తులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మొదటి అధికారిక అమెరికా పర్యటన సందర్భంగా బుధవారం వైట్ హౌస్ వద్ద అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ మోడీకి ఘ‌న స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి బిడెన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సందర్భంగా నేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. జూన్…

Read More

ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో అమెరికాలో టీచర్ ఉద్యోగాలు

-మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులకు జాబ్ ఆఫర్ లెటర్స్ అందచేసిన చంద్రబాబు నాయుడు -టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు హామీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం ఇక్కడ పార్టీ…

Read More

సింగపూర్ గడ్డపై ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుక

– తరలివచ్చిన తెలుగువారు – ముఖ్య అతిథులుగా హాజరైన పయ్యావుల కేశవ్, మంతెన రామరాజు, సాయిబాబా సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ నిర్వహించిన అన్న నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు జూన్ 18 న జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ , ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు , 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ శేష సాయిబాబ హాజరై ప్రసంగించారు పయ్యావుల కేశవ్ గారు…

Read More

డాలర్‌ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం!

– మరి కొందరు భారత సంపన్నులు స్వదేశానికి రావడం పెరుగుతోంది! ఎంపీ విజయసాయిరెడ్డి ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్‌) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చగల్, స్పెయిన్‌ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది. కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్‌…

Read More

బహ్రెయిన్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

– ముఖ్య అతిధిగా నారా రోహిత్ శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండుగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం శ్రేణులు ఘనంగా ఒక పండగ వాతావరణము లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వదేశం నుండి ముఖ్య అతిధిగా నారా రోహిత్ మరియి గుమ్మడి గోపాల కృష్ణ  ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు….ఈ కార్యక్రం జ్యోతి ప్రజ్వలన తో మొదలైంది. తెలుగు దేశం బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాధ్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి…

Read More

అమెరికాలో మోడీ ప్రభుత్వ విజయాలు హైలైట్ చేసే కార్యక్రమాలు

– మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం భారతీయ ప్రవాసులను ఉద్దేశించి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో సాధించిన విజయాలను వెలుగులోకి తీసుకురావడానికి మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బిజెపి నాయకుడు ఎన్. రాంచందర్ రావుకు బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం పంపారు. 9 సంవత్సరాల తెలంగాణ రాజకీయ అంశాలపై గురించి కూడా మాట్లాడతారని తెలిపారు. రాంచందర్ రావు తన పర్యటనలో ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ఏడు సమావేశాల్లో ప్రసంగించనున్నారు. అతని సందర్శనకు…

Read More

అమెరికాలో అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఐ లహరి మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే భారతీయ-అమెరికన్ మహిళ శవమై కనిపించింది. సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. నివేదికల ప్రకారం.. టెక్సాస్‌లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్‌వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు. వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ…

Read More

అమెరికా రాజధాని డిసిలో ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమ సన్నాహక సమావేశం, ఏర్పాట్లపై సమీక్ష

ఈ ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం మరియు ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు.. ఈ సందర్భంగా సుమారు 2000 పైచిలుకు అన్న గారి అభిమానులు, కుటుంబ సమేతంగా పాల్గొంటారని, ఆ మహనీయుని స్మరించుకొని, సామాజిక సేవా దృక్పధంతో ముందుకు సాగాలని కోరుతూ .. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ అతిధులుగా జయరాం కోమటి, మన్నవ…

Read More