Home » Political News » Page 86

అవును.. మోదీ ఈ దేశానికి చేసిందేంటి?

యస్. ఇన్నేళ్లలో ఈ దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ చేసిందేమిటి? ఆయన వల్ల ఈ దేశానికి జరిగిందేమిటి? ఒరిగిందేమిటి? పక్క దేశాలతో పోటీ పడేలా దేశాన్ని తీర్చిదిద్దారా? పోనీ ఆహార, రక్షణ, ఉత్తత్పి రంగాల్లో పరాయి దేశాల సరసన నిలిచేలా చేశారా? ఇంకా ఇవేనా? దేశ ప్రజల ముందు అనేక ప్రశ్నలు. ఇంకా చదవండి. బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు.. ఆయిల్ లేకా..పాలు లేక కనీసం మంచినీరుకు కూడా కటకట లాడుతున్నారు.. శ్రీలంక జనాభా…

Read More

వంగవీటి రంగా హత్య వెనుక…

– రంగా ఎన్టీఆర్ అభిమానా? సొంత పార్టీ వారే ద్రోహం చేశారా? విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడి మీద హత్య ప్రయత్నం జరిగింది… అంటే నమ్మాము. ప్రతిపక్ష నాయకుడి సొంత బాబాయి హత్య అధికారంలో ఉన్న వారి సహకారంతోనే జరిగింది….. అంటే నమ్మాం. కానీ ఎన్నికల అయిపోయి…. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత… పై రెండు సంఘటనలలో అప్పటి పాలకులు పాత్ర లేదని… కాలం నిరూపించింది. సరిగ్గా అలాంటిదే, 1988 డిసెంబర్ 26న జరిగిన వంగవీటి మోహన…

Read More

నాకు రెండు కళ్ళు పోయినా సరే….

శత్రువుకు ఒక కన్నైనా పోవాలన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. హుజురాబాద్ లో టీఆరెస్ ఓడింది..బీజేపీ గెలిచింది అనే విషయాలను వదిలేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మూడువేల చిల్లర ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ సీనియర్ నాయకులను ఆనందాంబుధిలో ముంచెత్తింది. దీపావళి పండుగ రెండు రోజులు ముందే వచ్చినదని సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో వీడియో సాక్ష్యంతో దొరికిపోయి, ఆ తరువాత చంద్రబాబు సలహాతో కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాక, చంద్రబాబు సిఫార్సుతో ఏకంగా…

Read More

ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన వేళ..ఆత్మ గౌరవం తలెత్తుకుని నిలబడ్డ రోజు

– చరిత్రకు వేదికైన హుజురాబాద్..అక్కడి ప్రజల తీర్పు మేధావులకు అందని చైతన్యం సామాన్య ప్రజల పట్ల కనీస గౌరవం లేని, అహంకారపూరిత రాజ్యం. మనుషులను కేవలం ఓటు వేసే ఒక జంతువుగానే చూస్తూ, మందు పోసి, పైసలిచ్చి కొనుక్కోవచ్చుననే దుర్మార్గపు దొర మనస్తత్వం. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం. తానొకవైపు, తన కుటుంబ సభ్యులొకవైపు, తన కింది నాయకులు మరొకవైపు లక్షల కోట్ల అవినీతి, భూ ఆక్రమణలు. తానాతందానా…

Read More

కేసీఆర్ ఓడిపోయారా? కేసీఆర్‌ను ఓడించారా? హుజురాబాద్‌ ర‌ణ‌నీతి ఏంటి?

నేను మామూలు మ‌నిషిని కాను, ముఖ్య‌మంత్రిని… ప్ర‌గ‌తిభ‌వ‌న్ అధినేత‌ను.. ఉద్య‌మనాయ‌కుడిని.. తెలంగాణ నా జాగీరు.. ప్ర‌శ్నిస్తే ప‌క్క‌న‌పెట్టేస్తా. ఇలా ఉంటుంది కేసీఆర్ మ‌నోభావం అని అంటుంటారు. అందుకు త‌గ్గ‌ట్టే ఉంటుంది ఆయ‌న వ్య‌వ‌హార‌ తీరు. కేసీఆర్ మోనార్క్ అని.. ఎవ‌రి మాటా విన‌ర‌ని, మంత్రుల‌నూ ప‌ట్టించుకోర‌ని, ప్ర‌జ‌లంటే చుల‌క‌న భావ‌మ‌ని, అది ప్ర‌గ‌తిభ‌వ‌న్ కాదు, బానిస భ‌వ‌న్ అంటూ.. కేసీఆర్ ఉక్కు పిడికిలి విడిపించుకొని బ‌య‌టికొచ్చారు ఈట‌ల రాజేంద‌ర్. కేసీఆర్‌తో రెండు ద‌శాబ్దాల అనుబంధం ఉన్న కుడిభుజం…

Read More

అన్నతో ఉందాం…అండగా ఉందాం

భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన వ్యక్తి జగనన్న.. జనం కోసం తనని తాను కోల్పోయిన మనసున్న మారాజు… తల్లి, చెల్లి, భార్యాపిల్లలూ, కుటుంబం అందరినీ వదిలి, అన్నిటినీ వదులుకుని మనకోసం పదేళ్ళకి పైగా అరణ్యవాసం చేసిన యువరాజు. అధికారమే పరమావధిగా బతికితే ఇన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బాధలు పడాల్సిన అవసరం లేదన్నది మనకందరికీ తెలిసిందే.. కానీ జనానికి ఏదో చేయాలి, మునుపటి కంటే మరింత మెరుగైన జీవితాలను, భవిష్యత్తు ను…

Read More

విశాఖ ఉక్కు వైఎస్సార్సీపీని ఇరుకున పెట్టబోతుందా?

విశాఖపట్నం ఉక్కు ఉద్యమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని నాయకత్వం వహించమని, మద్దతివ్వమని కార్మిక సంఘాలు కోరడం, ఆయన లక్షలాది మంది జన సైనికులతో మీటింగ్ ఏర్పాటు చేయడం , అది గ్రాండ్ సక్సెస్ కావడం ఇది రాష్ట్ర ప్రజల్లో కొంతమందికి సంతోషం ,కొంతమందికి ఆక్రోశం రావడం మనం ఊహించవచ్చు. అయితే ఆ మీటింగ్ లో ఆయనను ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరిన ఉద్యమకారులు, కార్మిక సంఘాల నాయకులు ఒకరకంగా నిరుత్సాహనికి గురయ్యారు. ఎట్లా అంటే…

Read More

బద్వేల్‌ ఉప ఎన్నికలో నైతికంగా ఓడిన వైసీపీ.. కాదు ఓడించిన బీజేపీThe YCP that lost morally in the Badwell by-election .. not the defeated BJP

.అధికార పార్టీ వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందేమో! ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి మెజారీటీ సంఖ్య ఉపయోగపడుతుందేమో! కానీ బద్వేల్‌ ఉప ఎన్నికలో అధికార వైసీపీ నైతికంగా ఓడిపోయింది. ఇది రొటీన్‌ స్టేట్‌మెంట్‌ కాదు. రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఇది అధికార పార్టీకి మచ్చ తెచ్చేదే తప్ప.. గౌరవం పెంచేది కాదనంటున్నారు. నైతికంగా ఎందుకు ఓడిందంటారా? పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా… ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో పార్టీకి అంతులేని…

Read More

ఇప్పుడు మోడీదే కాదు..దేశ ప్రేమికుడైన భారతీయుడి ఛాతీ కూడా 56అంగుళాలే!

ఇంకా ఇంకా కుళ్లి కుళ్లి ఏడవండి.మా మోడీని.. బిజెపి ప్రభుత్వాన్ని చూసి. ఢిల్లీలో., ఇండియా RAW ఇజ్రాయెల్ MOSSAD అమెరికా CI రష్యా KGB ఇంగ్లాండ్ MI6 ప్రపంచంలోని మొదటి ఐదు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం కోసం కూర్చోవడం ఇదే మొదటిసారి. ఇది కొత్త భారతదేశ శక్తి . మొదటి విజయం… మోడీజీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు, రెండు వందల సంవత్సరాలు గా ఉన్న భారతీయ బానిసత్వాన్ని…

Read More

జగన్ రాజకీయ డ్రామా..

-షర్మిల హీరో.. రాధాకృష్ణ, కేసీఆర్ ప్రధాన పాత్రధారులు.. రేవంత్ ప్రత్యర్థి పాత్రధారి? తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్ట‌డం వెన‌క ఉన్నది జ‌గ‌నేన‌ని ఒక కొత్త సీక్రెట్ బయటపడింది… తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిని అడ్డుకోవ‌డం కోసమే జ‌గ‌న్ త‌న చెల్లితో ఈ వ్యూహాన్ని అమ‌లు ప‌రుస్తున్నార‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జగన్ అటు కేసీఆర్ ను, ఇటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ‌ను వారికే తెలియకుండా వాడుకుంటున్నార‌నే టాక్ స్పష్టంగా వినిపిస్తోంది. జగన్ – కేసీఆర్ : ఎవరు ఎవర్ని…

Read More